varra ravindar

కీలక నిజాలు బయటపెట్టిన వ‌ర్రా ర‌వీంద్ర రెడ్డి

గత వైసీపీ హయాంలో సోషల్ మీడియా లో అసత్యప్రచారాలు , అసభ్యకర పోస్టులు , వీడియోలు పోస్టు చేసి నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా లో ఇదే విధంగా అధికార పార్టీల నేతలపై పోస్టులు పెడుతుండడం , మహిళలను కిచ్చపరిచే విధంగా వ్యవహరిస్తుండడం తో కూటమి సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంలో పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేయడం తో వైసీపీ సోషల్ మీడియా టీం ను అదుపులోకి తీసుకుంటున్నారు.

Advertisements

తాజాగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి.. కడప రెండో అదనపు మెజి స్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం రవీందర్‌రెడ్డికి జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అలాగే ఈ కేసులో అరెస్టయిన మరో ఇద్దరు నిందితులు ఉదయ్, సుబ్బారెడ్డిలకు 41A నోటీసులు ఇచ్చి పంపాలని న్యాయమూర్తి పోలీసులకు తెలిపారు. . ఈ నేప‌థ్యంలో రిమాండ్ రిపోర్ట్‌లో వర్రా రవీంద్ర‌రెడ్డి సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌టపెట్టారు. ఐప్యాక్ టీమ్‌ కంటెంట్ ఇస్తే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేవాళ్ళమ‌ని తెలిపారు.

వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకుని నాయకులు, వారి కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టేవాళ్ళమ‌ని అన్నారు. వైసీపీ సోష‌ల్‌మీడియా బాధ్య‌త‌లు సజ్జల భార్గవరెడ్డి తీసుకున్న త‌ర‌వాత‌ మరింత రెచ్చిపోయామ‌ని చెప్పారు. జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవరెడ్డి బెదిరించాడని అన్నారు. 2023 నుండి త‌న ఫేస్‌బుక్ ఐడీతో భార్గవరెడ్డి పోస్టులు పెట్టాడని తెలిపాడు. షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకర పోస్టులు పెట్టామ‌ని ఒప్పుకున్నారు. ఆ పోస్టులు పెట్టాలని అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి త‌మకు కంటెంట్ ఇచ్చారని అన్నారు.

Related Posts
Vijayawada: పాపం..ఒకే జైలులో వంశీ,ఆంజనేయులు
Vijayawada: పాపం..ఒకే జైలులో వంశీ,ఆంజనేయులు

విజయవాడ జిల్లా కేంద్రంగా ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, న్యాయ వ్యవస్థల్లో అలజడి సృష్టిస్తున్నాయి. ప్రస్తుతానికి రాజకీయ నేత వల్లభనేని వంశీ, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు Read more

Pawan Kalyan : ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
Pawan Kalyan ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan : ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్ రేపు తెలుగు సంవత్సరాది ఉగాది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ Read more

5 రోజుల్లో మహాకుంభమేళాకు ఎన్ని కోట్లలో భక్తులు వచ్చారంటే..!!
కుంభమేళా పొడిగింపుపై ప్రభుత్వం క్లారిటీ

ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో చేరుతున్నారు. గంగా, యమునా, సర్‌స్వతి నదుల సంగమ ప్రదేశంలో పుణ్యస్నానం చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండే Read more

భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థినిలు
foodvikarabad

భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థినిలు -15 మంది విద్యార్థినులను ఆసుపత్రి కి తరలింపు -- తాండూరు గిరిజన వసతిగృహంలో ఘటన వికారాబాద్ జిల్లా ప్రతినిధి, ప్రభాతవార్త: Read more

Advertisements
×