costable events 1704714402

ఏపీ లో కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షల కాల్‌లెటర్లు డిసెంబరు 18న పోలీసు నియామక మండలి విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన కాల్‌లెటర్లను అందుబాటులో ఉంచింది. పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌, పుట్టినతేదీ వివరాలు నమోదు చేసి కాల్‌లెటర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డిసెంబర్‌ 29 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం స్టేజ్‌-2 పీఎంటీ/ పీఈటీ పరీక్షలు డిసెంబర్‌ 30 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 94414 50639 లేదా 91002 03323 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.

ఫిజికల్ ఈవెంట్ల షెడ్యూల్ :
👉 సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.
👉 ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.

మెయిన్ పరీక్ష విధానం:

👉 ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
👉 సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
👉 ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.

Related Posts
మళ్లీ ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు
Bomb threats to Delhi schools again

న్యూఢిల్లీ: మరోసారి దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. శుక్రవారం దాదాపు 30 పాఠశాలలకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం Read more

డీప్ ఫేక్‌తో సమాజంలో చిచ్చు : సీఎం రేవంత్
CM Revanth Reddy participated in Cyber

హైదరాబాద్‌: హైదరాబాద్ లో జరిగిన సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 2025 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం Read more

నేడు తణుకులో సీఎం పర్యటన
రేపు ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తణుకులో పర్యటించనున్నారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రాన్ని శుభ్రంగా, హరితంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన Read more

సునీతా విలియమ్స్‌ రాక మరింత ఆలస్యం
Sunita Williams arrival delayed further

న్యూఢిల్లీ: దాదాపు 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్‌లను భూమి మీదకు తీసుకువచ్చేందు చేపట్టిన నాసా, స్పేస్ ఎక్స్‌లు ప్రయోగించిన క్రూ-10 Read more