KTR tweet on the news of the arrest

కాంగ్రెస్ వచ్చింది-కష్టాలు తెచ్చింది – కేటీఆర్ ట్వీట్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా, “కాంగ్రెస్ పాలన రాష్ట్రాన్ని వణికించుకుంటూ, ధర్నాల ద్వారా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు” అని మండిపడ్డారు. “మూలకున్న ముసలవ్వ నుంచి బడిపిల్లల వరకు, అన్ని వర్గాల ప్రజలు ఈ పాలనపై ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది, అందరూ కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదిక ట్విటర్ (X)లో రాసుకొచ్చి, కాంగ్రెస్ పై తన నిరసనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బహిరంగంగా వ్యక్తపరిచారు.

బెటాలియన్‌ కానిస్టేబుళ్ల దుర్భర పరిస్థితిపై వారి కుటుంబసభ్యులు చేస్తున్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. నిన్నటి దాకా బెటాలియన్‌ ఎదుట ధర్నా చేసిన కానిస్టేబుళ్ల భార్యలు ఇవాళ రాష్ట్ర సచివాలయం ఎదుట నిరసనలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బెటాలియన్‌ కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబసభ్యులు శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున హైదరాబాద్‌ చేరుకుని సెక్రటేరియట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. తమ భర్తలను కూలీల కంటే హీనంగా చూస్తున్నారని.. వాళ్లతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని మండిపడ్డారు.

దద్దమ్మ పాలనలో ధర్నాలతో దద్దరిల్లుతున్న తెలంగాణ రాష్ట్రం

దిక్కుమాలిన పాలనలో దిక్కుమొక్కు లేని జీవితాలు

అలంపూర్ నుండి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు

గ్రామ సచివాలయం నుండి మొదలు రాష్ట్ర సచివాలయం వరకు

రైతు నుండి మొదలు రైస్ మిల్లర్ల వరకు*

కార్మికుని నుండి మొదలు కాంట్రాక్టర్ల వరకు… pic.twitter.com/x352EIVdOg— KTR (@KTRBRS) October 25, 2024

Related Posts
న్యాయమూర్తులను ఏరేస్తున్న ట్రంప్
గాజాను స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ ఇవ్వకుండా 20 మంది ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులను తొలగించారు. ఈ నిర్ణయం అమెరికా రాజకీయ Read more

కులగణన నివేదిక ఫేక్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ
teenmar mallanna

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కులగణన నివేదికపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలు చేశారు. ఈ Read more

విడాకుల కోసం ఐదు కోట్లు చెల్లించాలని సుప్రీం ఆదేశం
ప్రజాస్వామ్యంలో మీ రాజ్యం ఏంటి?: సుప్రీంకోర్టు

ఢిల్లీ, డిసెంబర్ 12,వారిద్దరూ భార్యాభర్తలు. అయితే రెండు దశాబ్దాలుగు వారు చేస్తున్న పోరాటంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు చేసింది. ఈ కేసుకు సంబందించిన పూర్తి వివరాలు ఇలా Read more

ప్రజా భవన్ లో బిసి నేతల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్ పాయింట్స్
ప్రజా భవన్ లో బిసి నేతల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్ పాయింట్స్

తెలంగాణ ప్రభుత్వ బీసీ జన గణనపై స్పష్టత కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని ప్రతి ఇంటికి ప్రచారం చేయండి ఈ దేశంలో ఇప్పటివరకు బీసీ Read more