kamareddy congres

కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ శ్రేణులు షాక్ …

తెలంగాణాలో అధికార పార్టీ కాంగ్రెస్ కు సొంత పార్టీ శ్రేణులే భారీ షాక్ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండామోస్తు వచ్చిన తమను కాదని ఇతర పార్టీల నుండి వచ్చిన వారికీ పదవులు ఇవ్వడం పై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుక్కారు. గురువారం కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగారు. బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ మండలాల పరిధిలో సీనియర్‌ కార్యకర్తలు ఉన్నా.. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన దుర్గం శ్యామలకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని కట్టబెట్టడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేవంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని ఇటీవల కాంగ్రెస్‌లోకి వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరులకు పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తమ ఆవేద‌నను పార్టీ పెద్దలు గుర్తించకపోతే హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ ఎదుట నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ను తొలగించి.. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ ప్రతిపాదించిన ఒరిజినల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Related Posts
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం.. విద్యార్థులకు ఇబ్బందులు
Board of Intermediate Nirwakam..Students are in serious trouble

ఇంటర్ మెమోలలో తప్పుగా ప్రింట్ అయిన ఫొటోలు.. హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం వెలుగు చూసింది. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టేలా Read more

తమన్ వ్యాఖ్యలు హృదయాన్ని తాకాయి: చిరంజీవి
తమన్ వ్యాఖ్యలు హృదయాన్ని తాకాయి: చిరంజీవి

ప్రస్తుత కాలంలో సినిమాల చుట్టూ వృద్ధిచెందిన ప్రతికూలత మరియు ట్రోలింగ్ ధోరణికి వ్యతిరేకంగా ఇటీవల వ్యాఖ్యానించిన సంగీత దర్శకుడు తమన్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ముందుకు Read more

సత్యకుమార్ యాదవ్పై హత్యాయత్నం..పోలీసులకు ఫిర్యాదు
satyakumar yadav

మంత్రి సత్య కుమార్ యాదవ్ పై గత వైసీపీ ప్రభుత్వంలో హత్యాయత్నం జరిగిందని బీజేవైఎం నేత సురేశ్ గుంటూరు ఎస్పీకి పిర్యాదు చేసారు. 2023లో రైతుల దీక్షకు Read more

ప్రమాదంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ : హరీష్ రావు
The accident should be investigated by the sitting judge.. Harish Rao

హైదరాబాద్‌: తెలంగాణను కరువు కాటకాల పాలు చేసి 60 ఏండ్లు ఘోర కలిని సృష్టించింది కాంగ్రెస్. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే బాబుకి ఊడిగం చేసిన రేవంత్ ఇప్పుడు Read more