kanguva collections

‘కంగువా’ రెండో రోజు కలెక్షన్లు ఎంతంటే..?

సూర్య కంగువా మూవీ కలెక్షన్స్ రోజు రోజుకు భారీగా పడిపోతున్నాయి. తెలుగులో మన స్టార్ హీరోలతో సమానంగా స్టార్ డమ్ సొంతం చేసుకున్న సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “కంగువ”. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ పీరియాడిక్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి.

సూర్య ద్విపాత్రాభినయం, దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. కానీ సినిమా మాత్రం అభిమానుల అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ భారీగా పడిపోతున్నాయి. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.89.32 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. అయితే కలెక్షన్స్ పడిపోవడానికి కారణం..సినిమాపై వచ్చిన నెగిటివ్ టాక్ అని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ చూస్తే..

నైజాం 1.79 cr
సీడెడ్ 0.76 cr
ఉత్తరాంధ్ర 0.90 cr
ఈస్ట్ 0.26 cr
వెస్ట్ 0.17 cr
గుంటూరు 0.21 cr
కృష్ణా 0.33 cr
నెల్లూరు 0.10 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.52 cr
‘కంగువా’ చిత్రానికి రూ.13 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.14 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 2 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.4.52 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా 09 కోట్ల చిల్లర వరకు రావాల్సి ఉంది. అంత వస్తాయా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Related Posts
ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పందన
ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పందన

2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులకు శిక్ష ఖరారు చేస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు వెలువరించిన తీర్పుపై తండ్రి బాలస్వామి స్పందించారు. ప్రణయ్ Read more

అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్
అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్

గత నెలలో 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి అరెస్టు చేసి, తరువాత మధ్యంతర బెయిల్పై విడుదలైన Read more

మహిళపై మాజీ మంత్రి అనుచరుడు లైంగిక దాడి
The girl was raped.. The vi

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై రాజకీయ నేతల అనుచరుల వేధింపులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. తిరుపతి జిల్లాకు చెందిన ఓ మహిళపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరుడైన Read more

నేపాల్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా న‌మోదు!
Earthquake in Nepal .. 6.1 intensity on the Richter scale!

ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కాఠ్‌మాండూ: హిమాలయ దేశమైన నేపాల్‌లో భూకంపం సంభవించింది. సింధుపల్‌చోక్‌ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భూమి కంపించిందని సమాచారం. రిక్టర్‌ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *