thangalaan movie

ఓటీటీలోకి వచ్చేసిన తంగలాన్..

ఇటీవల ఓటీటీ ట్రెండ్ సినీప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. థియేటర్లలో విజయం సాధించిన చాలా సినిమాలు నెల రోజులు కూడా గడవకముందే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు చేరుకుంటున్నాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రం వివిధ కారణాల వల్ల ఆలస్యంగా మాత్రమే ఓటీటీలోకి వస్తున్నాయి. వాటిలో “తంగలాన్” ముఖ్యమైనది. సినీప్రియులు ఎప్పటినుంచో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.తంగలాన్ సినిమా ఎలాంటి ముందస్తు ప్రకటనలేకుండానే నేరుగా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ కావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.ఈ చిత్రానికి ఆలస్యంగా ఓటీటీ రిలీజ్ కావడానికి ప్రధాన కారణం కోర్టు కేసులు మరియు నిర్మాణ సంస్థకు ఓటీటీలతో ఉన్న విభేదాలే. అయితే, గత నెలలో కోర్టు క్లియరెన్స్ రావడంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.

Advertisements

చివరకు మంగళవారం ఉదయం ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో మెప్పించారు.ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పార్వతి తిరువోతు కథానాయికగా కనిపించగా, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మాళవిక మోహనన్ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. విక్రమ్ లుక్, యాక్టింగ్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కగా, జీవీ ప్రకాష్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం కథనం,నటన,సాంకేతిక అంశాల పరంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.తంగలాన్ కథ ఒక గిరిజన తెగ స్వేచ్ఛ కోసం సాగించిన పోరాటం చుట్టూ తిరుగుతుంది. అడవిలో దాగి ఉన్న బంగారు నిధిని వెలికితీయడానికి తంగలాన్ (విక్రమ్) యత్నిస్తాడు. కానీ ఆ నిధికి రక్షణగా ఉండే ఆరతి (మాళవిక మోహనన్) ఆయనకు ఎదురవుతుంది. ఆరతి అసలు ఎవరు? తంగలాన్ తన బృందంతో ఎలాంటివాళ్లనుఎదుర్కొన్నాడు? నిధిని పొందడంలో విజయం సాధించాడా? అనే అంశాలు ఆసక్తికరంగా నడుస్తాయి.యాక్షన్, థ్రిల్,ఎమోషన్‌ మేళవించిన ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.సినిమా అభిమానుల కోసం పా రంజిత్ రూపొందించిన ఈఅద్భుతం ఓటీటీలో మరింత ప్రజాదరణ పొందుతుందనడంలో సందేహం లేదు.

Related Posts
Kaliyugam 2064 Movie: కలియుగమ్‌-2064 మూవీ ట్రైల‌ర్ విడుదల
Kaliyugam 2064 Movie: కలియుగమ్‌-2064 మూవీ ట్రైల‌ర్ విడుదల

కిశోర్‌,శ్రద్ధా శ్రీనాధ్‌, ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సినిమా ‘కలియుగమ్‌-2064’ తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రమోద్‌ సుందర్‌ దర్శకత్వం వ‌హించ‌గా ఆర్.కె. ఇంటర్నేషనల్ Read more

Sukumar;పుష్ప 2 విషయంలో సుక్కు  అసంతృప్తిగా ఉన్నాడు,
Pushpa 2

సుకుమార్: పుష్ప 2 కోసం దాదాపు మూడు సంవత్సరాలుగా సుకుమార్ మరియు ఆయన టీం అహర్నిశలు కష్టపడుతున్నారు. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం మీద భారీ Read more

Vishwak Sen: టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోరీ

టాలీవుడ్ యువహీరో విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన చోరీ ఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ ఫిలింనగర్‌ రోడ్డు నెంబర్‌- 8 లోని విశ్వక్ సేన్ Read more

షారుఖ్ , సంజయ్ , సల్మాన్ , గోవిందా,అమీర్ ఖాన్..ఎంతో మంది హీరోలతో నటించా
mamatha kulakarni

ఒకప్పుడు తన అందం, అభినయంతో అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేసిన స్టార్ హీరోయిన్ మమతా కులకర్ణి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అప్పట్లో యువత గుండెల్లో తన అందంతో Read more

Advertisements
×