ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు

ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు

ఒడిశా గవర్నర్‌ రఘుబర్‌దాస్‌ రాజీనామాతో.. ఆయన స్థానంలో కంభంపాటి హరిబాబు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చక్రధారి శరణ్‌ సింగ్‌ ప్రమాణం చేయించారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కంభంపాటి హరిబాబు 2021 జులైలో తొలిసారి మిజోరం గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. రాజధాని భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌, మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

 ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు


ఒడిశా గవర్నర్‌ రఘుబర్‌దాస్‌ రాజీనామాతో.. ఆయన స్థానంలో కంభంపాటి హరిబాబును నియమిస్తూ గతేడాది డిసెంబర్‌లో కేంద్రం ప్రకటించింది. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మాజీ కార్యద‌ర్శి అజ‌య్ కుమార్ భ‌ల్లా ఇవాళ మ‌ణిపూర్ గ‌వ‌ర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భ‌వ‌న్‌లోని ద‌ర్బార్ హాల్‌లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జ‌రిగింది.
ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నరులు
దేశంలోని ఐదు రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే. బీహార్‌ గవర్నర్‌గా ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌, కేరళ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌, ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, మిజోరం గవర్నర్‌గా జనరల్‌ విజయ్‌ కుమార్‌ సింగ్‌, మణిపూర్‌ గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లాను నియమించింది.

Related Posts
“జై భవాని”, “జై శివాజీ” నినాదాలతో ప్రధాని మోదీ ప్రసంగం ప్రారంభం..
modi 9

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ఫలితాలపై బీజేపీ కార్యాలయంలో తన ప్రసంగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన "జై భవాని" నినాదంతో ప్రసంగాన్ని Read more

మను భాకర్ డబుల్ ఒలింపిక్ విజేతకు ఖేల్ రత్న లేదు
మను భాకర్ డబుల్ ఒలింపిక్ విజేతకు ఖేల్ రత్న లేదు

మను భాకర్ డబుల్ ఒలింపిక్ పతక విజేతకు ఖేల్ రత్న నామినీల జాబితాలో లేదు ఈ ఏడాది ప్రారంభంలో పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన Read more

వక్ఫ్ బిల్లుకు జేపీసీ సిఫార్సుల ఆమోదం
వక్ఫ్ బిల్లుకు జేపీసీ సిఫార్సుల ఆమోదం

ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ ఆస్తుల చట్టబద్ధతను దేశవ్యాప్తంగా నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. గతంలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో Read more

అవకాశమిస్తే రాజ్యసభకు వెళతా.. లేకపోతే విశ్రాంతి: యనమల
If I get a chance, I will go to Rajya Sabha.. otherwise, I will rest: Yanamala

అమరావతి: టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు గురువారం శాసనసభ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. భవిష్యత్తులో పార్టీ అవకాశమిస్తే రాజ్యసభకు వెళతానని, లేకపోతే విశ్రాంత Read more