patnam

ఒకే నేరానికి 3 FIRలా?..పొలీసులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

లగచర్ల ఘటనలో BRS నేత పట్నం నరేందర్రెడ్డిపై మూడు FIRలు నమోదుచేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఫిర్యాదుదారు మారిన ప్రతిసారీ కొత్త FIR పెట్టడం ఎలా సమర్థనీయమని పోలీసులను ప్రశ్నించింది. ఫిర్యాదు రాసిన రైటర్, తేదీలు, నిందితుల పేర్లు, కంటెంట్ మాత్రం ఒకేలా ఉన్నాయని తెలిపింది. కాపీ కొట్టడానికి కూడా కొంత తెలివి అవసరమని వ్యాఖ్యానించింది. నరేందర్ బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది.

Advertisements

హైకోర్టు పేర్కొన్నదాని ప్రకారం.. మూడు ఎఫ్‌ఐఆర్‌ల్లో ఫిర్యాదుదారులు మాత్రమే మారారు కానీ ఫిర్యాదుల వివరాలు, రైటర్, తేదీలు, నిందితుల పేర్లు, కంటెంట్ పూర్తిగా ఒకేలా ఉన్నాయి అని పేర్కొంది. దీనిపై కోర్ట్ సెటైర్ వేసింది. “కాపీ కొట్టడానికి కూడా కొంత తెలివి అవసరం” అని వ్యాఖ్యానించింది. దీనిపై పోలీసుల తీరును తప్పుబడుతూ, ఫిర్యాదు పరిధిలో ఒకే ఘటనకు సంబంధించి ఇలా పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం సరైన పద్ధతా? అని ప్రశ్నించింది. ఒకే సంఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయవద్దన్న సుప్రీంకోర్టు తీర్పులను పట్నం నరేందర్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. లగచర్ల గ్రామ రైతులకు మద్దతుగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ‘మహా ధర్నా’ చేపట్టింది. మహబూబాబాద్ జిల్లా మానుకోటలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో బిఆర్‌ఎస్‌ నాయకులు సత్యవతి రాథోడ్‌, ఎం.కవిత, ఇ.దయాకర్‌రావు, మధుసూధనాచారి, ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇక ల‌గ‌చ‌ర్ల‌లో అధికారుల కార్య‌క్ర‌మంలో రైతులు దాడి చేశారంటూ బొంరాస్‌పేట పోలీసులు మూడు ఎఫ్ఐఆర్‌ల‌ను ఎందుకు న‌మోదు చేశారో పూర్తి వివ‌రాలు అంద‌జేయాల‌ని ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఒక నేరానికి సంబంధించి మూడు ఎఫ్ఐఆర్‌లు న‌మోదు చేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి త‌ర‌పున ఆయ‌న భార్య శృతి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను జ‌స్టిస్ కే ల‌క్ష్మ‌ణ్ విచారించారు.

Related Posts
అమిత్‌షాకు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదు : షర్మిల
Amit Shah is not eligible to enter Andhra.. Sharmila

అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. పార్లమెంట్‌లో భారతరత్న బీఆర్ Read more

‘కేర్‌గివర్స్ హ్యాండ్‌బుక్‌’తో చికిత్స సులభతరం
Launch of Care Givers Handbook in Hyderabad for Medical treatment

· తెలంగాణ ప్రభుత్వ, సెర్ప్ సీఈఓ & ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి శ్రీమతి దివ్య దేవరాజన్, హైదరాబాద్ యొక్క ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ద్వారా రోగులకు Read more

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలషెడ్యూల్‌ విడుదల
Maharashtra and Jharkhand assembly election schedule released

న్యూఢిల్లీ: మహారాష్ట్ర లో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందుకోసం అక్టోబర్‌ 22న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. 29వ Read more

సమంత ఇరగదీసింది
sam dance

వరుణ ధావన్ రాబోయే సినిమా ‘బేబీ జాన్’ నుంచి ఇటీవల విడుదలై దుమ్ము రేపుతున్న ‘నైన్ మటక్కా’ సాంగ్‌కు సమంత, వరుణ్ ధావన్ వేసిన డ్యాన్స్ సోషల్ Read more

×