Fireworks accidents in ap

ఏపీలో బాణసంచా ప్రమాదాలు… ముగ్గురి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో రెండు వేర్వేరు చోట్ల జరిగిన బాణసంచా ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఏలూరులో జరిగిన ఘటనలో, బైక్‌పై టపాసులు తీసుకెళ్తున్న సుధాకర్ అనే వ్యక్తి రోడ్డుపై ఉన్న గుంతలో బండి అదుపుతప్పడంతో టపాసులు రోడ్డుపై పడి పేలాయి. ఈ పేలుడు ధాటికి సుధాకర్ సజీవదహనమయ్యాడు. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడగా, వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

మరోవైపు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో నిన్న సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఉరుములతో కూడిన వర్షం సమయంలో పిడుగు పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు వి.శ్రీవల్లి (42) మరియు జి.సునీత (35)గా గుర్తించారు. మరో ఐదుగురు తీవ్ర గాయపడగా, వారిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం నుంచి తొమ్మిది మంది స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు.

Related Posts
మహానంది ఆలయానికి రెండు కోట్ల భారీ విరాళం ఇచ్చిన భక్తుడు
mahanandi

నంద్యాల జిల్లా గోపవరం గ్రామానికి చెందిన రిటైర్డ్ లెక్చరర్ రాజు, మహానంది ఆలయానికి తన అపార భక్తిని చాటుతూ దేవస్థానానికి భారీ విరాళం అందించారు. ఆయన 2 Read more

కోనసీమలో పర్యావరణ కార్యకర్తను స్తంభానికి కట్టేసి దాడి చేసిన ఆక్వా రైతులు
konaseema

కోనసీమలో పర్యావరణ కార్యకర్తను స్తంభానికి కట్టేసి దాడి చేసిన ఆక్వా రైతులు అమలాపురం :తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడిని కోనసీమలో Read more

ఏపీకి ‘దానా’ తుఫాను ముప్పు
AP Cyclone Dana

బంగాళాఖాతంలో 'దానా' తుఫాను ముప్పు పొంచి ఉండటంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ఇవాళ తుఫానుగా, రేపు తీవ్ర Read more

ఏపీకి నాయ‌క‌త్వం వ‌హించే సామ‌ర్థ్యం కేవలం పవన్ కే ఉంది – విజయసాయి రెడ్డి
vijayasai cbn

వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశిస్తూ.. 75 ఏళ్ల వృద్ధుడు ఆంధ్రప్రదేశ్‌కు Read more