NEW PHC

ఏపీలో కొత్తగా 88 పీహెచ్సీలు

ఏపీలో 88 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ పార్లమెంటులో తెలిపారు. PHCల్లో 72 మంది స్టాఫ్ నర్సులకు 68 మందిని, 45 మంది వైద్యులకు 42 మందిని నియమించినట్లు చెప్పారు. జిల్లా అర్బన్ పీహెచ్సీల్లో 97 మంది స్టాఫ్ నర్సులకు 86 మందిని, 49 మంది వైద్యులకు 48 మందిని నియమించినట్లు వెల్లడించారు.

ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలో మొత్తం 88 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పి.హెచ్.సి) లు ఏర్పాటు చేయ‌నుండ‌గా, ఎన్టీఆర్ జిల్లాలో రెండు ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలకు ఆమోదం ల‌భించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ స‌హాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

టీడీపీ ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల గురించి అడిగిన ప‌లు ప్రశ్నల‌కు శుక్ర‌వారం కేంద్ర స‌హాయ మంత్రి బదులిచ్చారు. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHCs) 72 మంది స్టాఫ్ న‌ర్సులకి ఆమోదం ల‌భించ‌గా ప్ర‌స్తుతం అందుబాటులో 68 మంది స్టాఫ్ న‌ర్సులను నియ‌మించిన‌ట్లు తెలిపారు. డాక్ట‌ర్ల విష‌యానికి వ‌స్తే 45 మంది డాక్ట‌ర్స్ కి ఆమోదం ల‌భిస్తే ప్ర‌స్తుతం అందుబాటులో 42 మంది డాక్ట‌ర్ల నియామ‌కం జ‌రిగింద‌న్నారు. జిల్లాలోని ఈ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో నిపుణులైన వైద్యుల నియామ‌కం జ‌ర‌గ‌లేద‌ని పేర్కొన్నారు.

Related Posts
అమిత్‌షాకు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదు : షర్మిల
Amit Shah is not eligible to enter Andhra.. Sharmila

అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. పార్లమెంట్‌లో భారతరత్న బీఆర్ Read more

South Korean: ద.కొ.లో రాజకీయ సంక్షోభం: హాన్ అభిశంసనను రద్దు చేసిన కోర్టు
ద.కొ.లో రాజకీయ సంక్షోభం: హాన్ అభిశంసనను రద్దు చేసిన కోర్టు

దక్షిణ కొరియా రాజ్యాంగ న్యాయస్థానం ప్రధాన మంత్రి హాన్ డక్-సూ పై అభిశంసనను సోమవారం రద్దు చేసింది. హాన్, తాత్కాలిక అధ్యక్షుడిగా తిరిగి నియమితుడయ్యారు. ఎనిమిది మంది Read more

శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్‌కు ఉచితంగా భూమి
శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్‌కు ఉచితంగా భూమి

శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్‌కు ఉచితంగా భూమి శ్రీలంక స్పిన్ మురళీధరన్ కు జమ్మూ కశ్మీర్‌లో ఉచిత భూమి కేటాయింపు రాజకీయంగా దుమారం రేపుతోంది. కథువా జిల్లాలో Read more

నేడు ఢిల్లీలో 101 మంది పంజాబీ రైతుల ర్యాలీ
101 Punjab farmers rally in Delhi today

న్యూఢిల్లీ: ఈరోజు మూడోసారి ఢిల్లీకి పంజాబీ రైతులు ర్యాలీ తీయ‌నున్నారు. శంభూ బోర్డ‌ర్ నుంచి 101 మంది రైతులు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర Read more