ఏపీలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు

ఏపీలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులవైపు దృష్టిని సారించింది. ఇందులో భాగంగా ఏపీలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఏపీలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు నిర్మించేందుకు ఉండవల్లిలోని తన నివాసంలో నిన్న పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అధికారులతో నిర్వహించిన సమీక్ష అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.

 ఏపీలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు


పూర్తి అయిన ఫీజిబిలిటీ సర్వే
శ్రీకాకుళంలో విమానాశ్రయ నిర్మాణానికి ఇప్పటికే ఫీజిబిలిటీ సర్వే పూర్తయిందని, అక్కడ రెండు దశల్లో 1,383 ఎకరాల్లో నిర్మించనున్నట్టు చెప్పారు. ఏపీలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు రావడం వల్లంది లాభాలను చంద్రబాబు వివరించారు. ఇందుకోసం భూసేకరణ జరుపుతున్నట్టు తెలిపారు. దగదర్తిలో 1,379 ఎకరాల్లో నిర్మించనున్న విమానాశ్రయం కోసం ఇప్పటికే 635 ఎకరాలు సేకరించినట్టు పేర్కొన్నారు. అలాగే, నాగార్జునసాగర్‌లో 1,670, తాడేపల్లిగూడెంలో 1,123 ఎకరాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మించనున్నట్టు వివరించారు. ఒంగోలులో 657 ఎకరాలు, తుని-అన్నవరం మధ్య 757 ఎకరాలను గుర్తించినట్టు చంద్రబాబు తెలిపారు.

Also Read: రైతు భరోసా విధివిధానాలు ఖరారైనట్లేనా..?


ఆరు నెలల్లో కొత్త టెర్మినల్ భవన నిర్మాణాలు పూర్తి
గన్నవరం విమానాశ్రయంలో నిర్మించే టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం థీమ్‌తో రూపొందించిన ఆకృతులతో నిర్మించేందుకు సీఎం ఆమోదం తెలిపారు. విమానాశ్రయ విస్తరణ, కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులను ఆరు నెలల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే, దగదర్తి ప్రాంతంలో బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోందని, అనకాపల్లి జిల్లాలో కొత్త పరిశ్రమలు, నక్కపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాబోతున్నట్టు వివరించారు. శ్రీసిటీలో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

Related Posts
నేడు దావోస్ పర్యటనకు చంద్రబాబు
chandrababu davos

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొనేందుకు దావోస్ పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు రాష్ట్ర అధికారుల బృందం కూడా Read more

ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ గ్రామ సదస్సులు ప్రారంభం
Revenue Meetings From Today in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సదస్సులు ప్రారంభమవుతాయి. వచ్చే నెల Read more

ఏలూరు, నెల్లూరు డిప్యూటీ మేయర్లుగా టీడీపీ అభ్యర్థులు
nelluru eluru

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ పాలక మండలుల్లో టీడీపీకి మరిన్ని విజయాలు లభించాయి. నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్గా టీడీపీ అభ్యర్థి తహసీన్ ఎన్నికయ్యారు. ఆమె 41 Read more

త్వరలో ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
Salary of Rs 2 lakh per month for cabinet rank holders - AP Govt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించనుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను చెల్లించాలని సీఎం చంద్రబాబు నాయుడు Read more