Free gas cylinder guarantee scheme to be implemented in AP from today

ఏపీలో ఈరోజు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ పథకం అమలు

అమరావతి: ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని నవంబర్ 1వ తేదీ శుక్రవారం నుంచి అమలులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఇది ఒక ముఖ్యమైన భాగం.

కాగా, శుక్రవారం ఈ పథకాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో సందర్శించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభిస్తారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో చర్చలు జరుపుతారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే చేశారు.

ఇకపోతే.. ఉచిత గ్యాస్ కోసం రాష్ట్రంలో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అర్హులైన ప్రజలకు ఉచిత గ్యాస్ అందించబడుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీపం-2 పథకానికి అనుగుణంగా ఉచిత సిలిండర్లు అందించబడనున్నాయి. ప్రతి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లతో పేదలపై గ్యాస్ భారాన్ని తగ్గించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు ఉచిత సిలిండర్లను నాలుగు నెలల వ్యవధిలో ఒకటి చొప్పున పంపిణీ చేయనున్నది.

Related Posts
త్వరలో పుతిన్‌తో మాట్లాడతా : డొనాల్డ్ ట్రంప్
Will talk to Putin soon.. Donald Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడి ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని పరిష్కరించడంలో సహాయం చేస్తానని చెప్పారు. విస్తృత శ్రేణి సమస్యలపై Read more

నటి కాదంబరీ జత్వానీ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం
AP government handed over the investigation of actress Kadambari Jethwani case to CID

అమరావతి: బాలీవుడ్ నటి కాదంబరీ జత్వాని కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు డీజీపీ Read more

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా:జగన్
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా:జగన్

జగన్ అధినేతలతో భేటీ:వైసీపీ అధినేత జగన్ వివిధ జిల్లాల నేతలతో సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. పార్టీ కార్యకర్తలకి అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా Read more

మోదీ కంటే కేజీవాలే కన్నింగ్ – రాహుల్ గాంధీ

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ తరహాలోనే కేజ్రీవాల్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *