ఏపీకి రెండు వందేభారత్ రైళ్లు

ఏపీకి రెండు వందేభారత్ రైళ్లు

భారతదేశంలో వందేభారత్ రైలు ఓ చరిత్ర. పలు సౌకర్యాలతో పాటు నిర్ణిత సమయంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఇందులో భాగంగా త్వరలో ప్రముఖ పుణ్యక్షేత్ర వారణాసికి ఏపీ నుంచి డైరెక్టు రైలు ప్రారంభం కానుంది. అదే విధంగా ఏపీ నుంచి మరో రెండు వందేభారత్ రైళ్లు వస్తున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వెల్లడించారు. ఏపీకి రెండు వందేభారత్ రైళ్లు రావడం అవిశ్వరనీయమైన వార్త.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్తున్న వందేభారత్ కు అనూహ్య స్థాయి లో డిమాండ్ కనిపిస్తోంది. ఈ క్రమంలో కొత్తగా కోచ్ లను పెంచుతున్నారు. ఇప్పుడు రైల్వే మంత్రి కి అందిన ప్రతిపాదనలతో తెలుగు రాష్ట్రాలకు తొలి విడతలోనే వందేభారత్ స్లీపర్ దక్కనుంది.

ఏపీకి రెండు వందేభారత్ రైళ్లు
ఏపీకి రెండు వందేభారత్ రైళ్లు


ఏపీకి మరిన్ని కొత్త రైళ్లు
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కీలక ప్రకటన చేసారు. ఏపీకి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ త్వరలోనే మరిన్ని కొత్త రైళ్లు ఏపీ నుంచి ప్రారంభం అవుతాయని వెల్లడించారు. అందులో భాగం గా నరసాపురం-వారణాసి మధ్య కొత్త రైలు ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే రైల్వే మంత్రిని కోరినట్లు చెప్పుకొచ్చారు. గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వారణాసి వెళ్లే ప్రయాణీకుల కోసం ఈ రైలు ఏర్పాటు చేయాలని కోరినట్లు వివరించారు. ఈ రైలు అందుబాటు లోకి వస్తే తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసి వెళ్లే ప్రయాణీకులకు మరింత సౌకర్యంగా ఉంటుంద ని మంత్రి పేర్కొన్నారు.

Related Posts
ఉత్తరాంధ్ర టీచర్ MLCగా గాదె శ్రీనివాసులు విజయం
Uttarandhra results are out

ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో PRTU అభ్యర్థి గాదె శ్రీనివాసులు ఘన విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆయన విజేతగా ప్రకటించబడ్డారు. లెక్కింపు Read more

ఆలయాల వద్దకు వచ్చే భక్తులకు భద్రత కల్పించడం పోలీసుల బాధ్యత
భద్రత కల్పించడం పోలీసుల బాధ్యత

పోలీస్ ఆవిష్కరణ ఆలయాల వద్దకు వచ్చే భక్తులకు భద్రత కల్పించడం పోలీసుల బాధ్యత అని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పాపన్నపేట మండల Read more

రేపు జగన్ ప్రెస్ మీట్
నేడు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు కీలక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో Read more

YSRCP: టీడీపీలో చేరనున్న 9 మంది వైసీపీ కార్పొరేటర్లు
YSRCP: టీడీపీలో చేరనున్న 9 మంది వైసీపీ కార్పొరేటర్లు

విశాఖలో వైసీపీకి మరో పెద్ద షాక్ – కూటమిలో చేరుతున్న కార్పొరేటర్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల్లో వేగంగా మారుతున్న సంఘటనలలో భాగంగా, విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి Read more