vijayasai cbn

ఏపీకి నాయ‌క‌త్వం వ‌హించే సామ‌ర్థ్యం కేవలం పవన్ కే ఉంది – విజయసాయి రెడ్డి

వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశిస్తూ.. 75 ఏళ్ల వృద్ధుడు ఆంధ్రప్రదేశ్‌కు నాయకత్వం వహించలేరని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ వంటి యువ రాష్ట్రానికి యువ నాయకుడు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. “రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ఉందని” అన్నారు. వయసు మరియు జాతీయ స్థాయి ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి సరైన నాయకుడిగా అని చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ నేషనల్ పాప్యులారిటీ ఉన్న, నిఖార్సయిన నాయకుడిగా కీర్తించారు. ఎన్డీఏ పార్టీల నాయకుల్లో పవన్ కళ్యాణ్‌ను అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తిగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ట్వీట్‌పై జనసేన శ్రేణులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మరి దీనిపై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Related Posts
ఈ కార్ రేస్ పై స్పందించిన మంత్రి పొంగులేటి
Minister strong warning to registration department employees

తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమోదైన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పులో ఏసీబీ దర్యాప్తులో Read more

BJP : డీకే పై బిజెపి ఆగ్రహం
DK

కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ చేసిన రాజ్యాంగ మార్పు వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చేందుకు సిద్ధంగా Read more

లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంటున్నా మంత్రి లోకేష్
లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంటున్నా మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ప్రత్యేకంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించినట్లు Read more

దావోస్ పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్
CM Revanth is ready to visit Davos

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 20న దావోస్‌కు పర్యటనకు వెళ్లనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (వర్ల్డ్ ఎకనామిక్ ఫోరం) నిర్వహించే వార్షిక సదస్సులో ఆయన పాల్గొననున్నట్లు Read more