LK Advani Indian politician BJP leader India 2015

ఎల్ కె అద్వానీకి అస్వస్థత

భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్ కె అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో శనివారం ఉదయం అద్వానీని ఆయన కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. బీజేపీ పార్టీకి ఎనలేని సేవలు అందించిన అద్వానీ గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో ఎల్ కె అద్వానీ కీలకపాత్ర వహించారు. అంతేకాక పార్టీ వృద్ధికి అయన కృషి చేసారు. ప్రస్తుతం ఆయన వయసు 97 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. రెండు నెలల క్రితం కూడా అద్వానీ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స తీసుకున్నారు. కాగా, అద్వానీ అస్వస్థతకు గురయ్యారని తెలియడంతో బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అద్వానీ తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Advertisements
Related Posts
పరిశుభ్రత కోసం ప్రపంచ టాయిలెట్ దినోత్సవం..
world toilet day

ప్రపంచ టాయిలెట్ దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 19న జరుపుకుంటారు. ఈ దినోత్సవం ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సానిటేషన్ సమస్యలను పరిష్కరించడం మరియు ప్రజలకు పరిశుభ్రత మరియు Read more

మంచు బ్ర‌ద‌ర్స్ వార్ మళ్లీ మొదలు
manoj vishnu

మంచు కుటుంబంలో ఆస్తుల వివాదం కారణంగా మంచు మనోజ్‌ మరియు మంచు విష్ణు మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా Read more

యుద్ధనౌకలను జాతికి అంకితం చేసిన మోడీ
narendra modi

భారత యుద్ధనౌకలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి కొద్దిసేపటి ప్రధాని మోడీ జాతికి అంకితం చేసారు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్- నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్‌షేర్ Read more

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 56 సంవత్సరాల తరువాత గయానాను సందర్శించారు
modi guyana

భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం గయానాను సందర్శించి, 56 సంవత్సరాల తరువాత గయానా వెళ్లిన మొదటి భారత ప్రధాని అయ్యారు. ఆయన గయానా రాజధాని Read more

×