kalyan

ఎంపీడీవోను పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌

వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఎంపీడీవో జవహర్‌బాబును డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ శనివారం పరామర్శించారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా గాలివీడులో జరిగిన ఈ సంఘటన తెలిసిందే. విజయవాడ నుంచి నేరుగా కడప జిల్లాకు వెళ్లి రిమ్స్‌లో ఉన్న ఎంపీడీవోను పరామర్శించి ధైర్యం చెప్పారు.
వైసీపీకి కొత్తమీ కాదు
ఇష్టారాజ్యంగా అధికారులపై దాడి చేస్తే ఉపేక్షించం. ఇంకా వైసీపీ రాజ్యం అనుకుంటున్నారా.. ఖబడ్దార్‌, తోలు తీసి కూర్చోపెడతామని వైసీపీ నాయకులను హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎంపీడీవోను అమానుషంగా కొట్టారని తెలిపారు. అధికారులపై దాడిచేయడం వైసీపీకి కొత్తమీ కాదని ఆరోపించారు. దాడులకు దిగి భయపెట్టాలని చూస్తే గత ప్రభుత్వం మాదిరి తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

Advertisements

ఘటనాస్థలికి సీఐ వెళ్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాలేదని, వైసీపీ నాయకులకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయని ఆరోపించారు. వైసీపీ దౌర్జన్యాలను ఎలానియంత్రిచాలో తెలుసు.. చేసి చూపిస్తామని అన్నారు. దాడి చేసిన వారిని ఎవరూ రక్షించలేరని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏంటో చేసి చూపిస్తామని పేర్కొన్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. ఘటనపై విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు వెల్లడించారు.

Related Posts
వివేకా కేసులో సాక్షుల మరణాల పై దర్యాఫ్తు
వివేకా కేసులో సాక్షుల మరణాల పై దర్యాఫ్తు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు: సాక్షుల మరణాలు, అనుమానాలు మరియు సమగ్ర దర్యాఫ్తు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తుతం కీలక దశలో ఉంది. Read more

ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతి
ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతి

ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి మండలం గుండాల కోన వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా గుండాలకోన ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులపై ఏనుగుల గుంపు Read more

ప్రతినెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలి:సిఎస్
స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం & స్వచ్ఛాంధ్ర దినోత్సవం స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రతి నెలా మూడవ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని విజయవంతంగా Read more

విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఇ.ఎస్.ఐ. వైద్యులుపై, వేటు తప్పదు
విధుల పట్ల నిర్లక్ష్యం వహించే

ఇ.ఎస్.ఐ. ఆసుపత్రుల ఉద్దేశం విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఇ.ఎస్.ఐ.కార్మికులకు ఉచితంగా ఉత్తమ వైద్య సేవలు అందజేయాలనే లక్ష్యంతోనే ఇ.ఎస్.ఐ. ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. అయితే, ఆ Read more

×