CM Chandrababu launched the free gas cylinder scheme

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఈరోజు ప్రారంభమైంది. దీపం 2 పథకంలోని భాగంగా సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈదుపురంలో మహిళా లబ్దిదారులలో ఒకటైన శాంతమ్మ ఇంటికి చంద్రబాబు వెళ్లి ఆమెకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించారు. అనంతరం జానకమ్మ అనే ఒంటరి మహిళకు పింఛన్ అందజేశారు. సీఎం తన ఇంటికి రావడంతో జానకమ్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

జానకమ్మ సీఎం చంద్రబాబుకు తన సొంత ఇల్లు కట్టించమని కోరారు. ఇందుకు సీఎం హామీ ఇచ్చి.. రేపటి నుంచే మీ ఇంటి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు కూడా దీనిపై ఆదేశాలు ఇచ్చారు. డ్వాక్రా కార్యక్రమంలో లీడర్‌గా ఉన్నావు కాబట్టి పది రూపాయలు సంపాదించుకోవాలి అని సీఎం జానకమ్మకు సలహా ఇచ్చారు. థైరాయిడ్, డయాబెటిక్ ఉన్న వారికి జనరిక్ మందులు అందుబాటులో ఉంటే చూడాలని కలెక్టర్‌ను సూచించారు. జానకమ్మ మాట్లాడుతూ.. “నేను రూ.500 నుంచి రూ.4000 వరకు అందుకుంటున్నాను. మీరు మాకు దేవుడు” అని సీఎం చంద్రబాబుకు తెలిపారు. 20 సంవత్సరాలుగా పేదరికంలో మగ్గుతున్నామని ఆమె చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి ద్రబాబు ఆమెను ఓదార్చారు.

Related Posts
నా ఇంటికి నన్ను ఎందుకు వెళ్లనివ్వడం లేదు : కేతిరెడ్డి పెద్దారెడ్డి
peddareddy

అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్వగ్రామం తాడిపత్రికి వచ్చేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏర్పాట్లు చేసుకోగా.. అందుకు పోలీసులు అనుమతించని పరిస్థితి Read more

హైకోర్టులో పేర్నినానికి ఊరట
perni nani

ఏపీలో సంచలనం సృష్టించిన బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి పేర్నినాని Read more

మహాత్ముడికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
President and Prime Minister paid tribute to the Mahatma

President and Prime Minister paid tribute to the Mahatma న్యూఢిల్లీ: గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ నివాళులర్పించారు. ఢిల్లీలోని Read more

బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సమీక్ష
CM Chandrababu review of budget proposals

ఈ ఏడాదే తల్లికి వందనం, అన్నదాత, ఉచిత బస్సు పై చర్చ అమరావతి: ఈనెల 28న ఉభయ సభల్లో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర Read more