Tet notification released today in Telangana

ఈ రోజు తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్‌ : తెలంగాణలో ఈరోజు టెట్‌ పరీక్షకు సంబంధించిన మరోమారు నోటిఫికేషన్ జారీ చేయనుంది. అయితే సంవత్సరానికి టెట్‌ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) రెండుసార్లు నిర్వహిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జనవరిలో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, ఈ పరీక్షలు సంక్రాంతి లోపా, తర్వాతా? అన్న విషయంలో స్పష్టత లేదు. పరీక్షల కోసం వారం, పది రోజులపాటు స్లాట్లు అవసరం. ఈ నేపథ్యంలో అవి దొరికే సౌలభ్యాన్ని బట్టి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Advertisements

అయితే మేలో నిర్వహించిన టెట్‌కు 2.35 లక్షల మంది హాజరు కాగా, 1.09 లక్షల మంది పాసయ్యారు. ఇక, టెట్-1 పేపర్‌కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ పూర్తిచేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కోసం టెట్ అర్హత ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టడంతో ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టెట్ నిర్వహించడం ఇది రెండోసారి.

టెట్-2024కు సంబంధించి మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13% అర్హత నమోదుకాగా.. పేపర్-2లో 34.18 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్-2023 ఫలితాలతో పోల్చితే పేపర్-1లో 30.24 శాతం, పేపర్-2లో 18.88 శాతం అర్హత పెరగడం గమనార్హం.

Related Posts
SSMB 29 మహేష్ బాబుకి ఇన్ని నిబంధనల!
SSMB 29 మహేష్ బాబుకి ఇన్ని నిబంధనల!

SSMB 29: ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కాంబినేషన్ - S.S రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక చిత్రంలో కలిసి పనిచేస్తున్నారు. Read more

ఐఈడీ పేలుడు.. కెమిక‌ల్ డిఫెన్స్ చీఫ్ మృతి
explosion at building kills two people in moscow

మాస్కో: ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో ఈరోజు అనుమానిత ఐఈడీ పేలుడు సంభ‌వించింది. న‌గ‌రంలోని రాజ‌న్‌స్కీ ప్రాస్పెట్ ప్రాంతంలో ఉన్న ఓ బిల్డింగ్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. Read more

రేవంత్ స‌ర్కార్‌పై కేటీఆర్ ఫైర్
ktr revanth

ప్ర‌భుత్వ‌, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప‌ట్ల నిర్ల‌క్ష్య ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒకటో తేదీన Read more

Assam :అస్సాం లో ఇంటర్ పరీక్షలు రద్దు
Assam :అస్సాం లో ఇంటర్ పరీక్షలు రద్దు

అస్సాంలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించింది. మార్చి 21న జరగాల్సిన 11వ తరగతి మ్యాథమెటిక్స్‌ పరీక్ష పేపర్ లీక్ కావడంతో అస్సాం ప్రభుత్వం Read more

Advertisements
×