police

ఈ పోలీస్ ఉద్యోగం చేయలేం!

ఇటీవల పోలీస్ ఉద్యోగం చేయాలనే ఆశ చాలామందిలో కలుగుతున్నది. ఇందుకు కారణం మంచి జీతం, ఇతర అలవెన్సులు వుంటాయని భావన కావచ్చు. అయితే మనం అనుకున్నత సులభం కాదు పోలీస్ ఉద్యోగం అంటె. కానిస్టేబుల్‌ పోస్టుకు దరఖాస్తు చేసినా.. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించినవారిలో చాలామంది ఫిట్‌నెస్‌ పరీక్షలకు వచ్చేసరికి ముఖం చాటేస్తున్నారు. ఫిట్‌నెస్‌ పరీక్షలు కఠినంగా ఉండటమే ఇందుకు కారణం. ఎప్పుడు రిక్రూట్‌మెంట్‌ నిర్వహించినా రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు మరణిస్తున్నారు. తాజాగా మచిలీపట్నంలో ఒక అభ్యర్థి రన్నింగ్‌లో ప్రాణాలు వదలడం విషాదకరం. కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో ఇప్పటికీ బ్రిటిష్‌ కాలం నాటి పద్ధతులు పాటించడం ఎందుకనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో ఉండేది కాదు. తగినన్ని వాహనాలు ఉండేవి కావు. దీంతో నేరస్తులను పట్టుకునేందుకు కానిస్టేబుళ్లకు వారికంటే దేహదారుఢ్యం, బలం ఉండాలని భావించేవారు. ఇప్పు డు సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. నేరాల తీరుతెన్నుల్లోనూ మార్పు వస్తోంది. ఎక్కడైనా ఘట న జరిగితే ఎస్‌ఐ లేదా ఇతర సిబ్బందితో కలసి టీమ్‌గా వెళ్తారు. ఇన్‌ఫార్మర్ల ద్వారా కూడా నేరస్తుల సమాచారం తెలిసిపోతుంది. అవసరమైన టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది.

ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన వారి నుంచి పీఈటీ, పీఎంటీ పరీక్షలకు పీఆర్‌బీ ఆహ్వానించింది. అర్హుల్లో 77,510 మంది పురుషులు, 16,734 మంది మహిళా అభ్యర్థులు.. మొత్తం 94,244 మంది ఉన్నారు. గతేడాది డిసెంబరు 30న రాష్ట్రంలోని 13 కేంద్రాల్లో ఫిజికల్‌ ఎఫిషియన్సీ, ఫిజికల్‌ మెజర్మెంట్‌ టెస్ట్‌ ప్రారంభమైంది. కఠినమైన ఎంపిక ప్రక్రియ నుంచి విధుల నిర్వహణలో సమస్యల వరకు ఎన్నో కారణాలతో ఈ ఉద్యోగంపై మక్కువ తగ్గిపోతున్నది అని నిరుద్యోగులు వాపోతున్నారు.

Related Posts
అవకాశమిస్తే రాజ్యసభకు వెళతా.. లేకపోతే విశ్రాంతి: యనమల
If I get a chance, I will go to Rajya Sabha.. otherwise, I will rest: Yanamala

అమరావతి: టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు గురువారం శాసనసభ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. భవిష్యత్తులో పార్టీ అవకాశమిస్తే రాజ్యసభకు వెళతానని, లేకపోతే విశ్రాంత Read more

మద్యం మాఫియాపై చంద్రబాబు విమర్శలు
మద్యం మాఫియాపై చంద్రబాబు విమర్శలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘనవిజయం తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ విజయాన్ని ఆయన చారిత్రాత్మకంగా పేర్కొంటూ, ప్రధాన Read more

మోహన్ బాబు పిటిషన్ విచారణ వాయిదా
mohan babu

హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. తన వయసు 78 ఏళ్లని, గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నానని, తనకు Read more

మెడికల్ టెస్టుల్లో పోసానికి గుండె సమస్యలు
మెడికల్ టెస్టుల్లో పోసానికి గుండె సమస్యలు

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని Read more