President Draupadi Murmu will visit Hyderabad on 21st and 22nd of this month

ఈనెల 21, 22న హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

హైదరాబాద్‌: ఈ నెల 21,22 తేదీల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదారాబాద్ లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అందుకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ద్రౌపది ముర్ము నగరంలో పర్యటన ఉన్నందున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమె పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్ము బస చేయనుండగా.. ఆ రూట్లలో ట్రాఫిక్ నిబంధనలు, కంట్రోల్, పోలీస్ బందోబస్తుపై డీజీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రెండ్రోజుల పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని అందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసి చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.

కాగా, ఈ నెల 21వ తేదీ గురువారం సాయంత్రం రాష్ట్రపతి హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచీ నేరుగా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవానికి హాజరవుతారు. 22వ తేదీ శుక్రవారం హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో జరిగే లోక్ మంతన్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Related Posts
మార్చి 24-25న బ్యాంకుల సమ్మె
Bank strike on March 24-25

న్యూఢిల్లీ: బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేర్చాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్స్‌తో జరిగిన చర్చలు విఫలమయ్యాయని బ్యాంకు యూనియన్లు తెలిపాయి. దీంతో ప్రణాళిక ప్రకారం మార్చి 24- Read more

నేడు తెలంగాణ ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌
Telangana EAPCET Notification today

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే Read more

మహిళా జర్నలిస్టు రేవతి అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్‌
మహిళా జర్నలిస్టు రేవతి అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్‌

సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతిని ఇవాళ ఉదయం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉదయం సుమారు 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీసులతో మహిళా జర్నలిస్ట్ Read more

మరికాసేపట్లో ఏపీ క్యాబినెట్ భేటీ
ap cabinet meeting 1

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇప్పటికే ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, చెత్తపై పన్ను రద్దు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. Read more