uke abbai

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బ‌య్య కన్నుమూత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా, అబ్బయ్య ఉమ్మడి ఏపీలో బూర్గంపాడు నుంచి 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1994, 2009లో ఇల్లందు ఎమ్మెల్యేగా పనిచేశారు. సీపీఐ నుంచి ఒకసారి..TDP నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇల్లందు మండలం హనుమంతుల పాడు గ్రామానికి చెందిన అబ్బయ్య సీపీఐ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసి తొలుత సుదిమల్ల సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అబ్బయ్య అంచలంచెలుగా ఎదిగి బూర్గంపాడు, ఇల్లందు నుంచి సీపీఐ తరుపున పోటీ చేసి రెండుమార్లు గెలుపొందారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరి ఇల్లందు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

2018లో టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. 1983లో బూర్గంపాడు నియోజకవర్గం నుంచి, 1994, 2009లో ఇల్లందు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన అబ్బయ్య మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, గుమ్మడి నరసయ్య, సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు సంతాపం తెలిపారు. అబ్బయ్య మృతితో కుటుంబ స‌భ్యులు, అనుచ‌రులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

Related Posts
దక్షిణాఫ్రికాలో ఘోర విషాదం
Tragedy in South Africa..100 workers died after being trapped in a gold mine

దక్షిణాఫ్రికాలో ఘోర విషాదం చోటు సంభవించింది. అక్కడ బంగారు గనుల్లో అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వచ్చిన వందలాది మంది కార్మికులు అందులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వాయువ్య Read more

PSLV-C59 రాకెట్ ప్రయోగం వాయిదా
PSLV C59

శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఈ రోజు 4:08 నిమిషాలకు జరగాల్సిన PSLV-C59 రాకెట్ ప్రయోగం తాత్కాలికంగా వాయిదా పడింది. యూరోపియన్ శాస్త్రవేత్తలు ప్రోబో-3 ఉపగ్రహంలో సాంకేతిక Read more

Telangana: కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court notices to the Central and AP government

Telangana: కృష్ణానది ప్రాజెక్టులపై కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కృష్ణా పరీవాహకంలోని ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB)కి అప్పగించాలని Read more

ట్రంప్ ఆహ్వానంతో అమెరికా వెళ్లనున్న మోదీ
విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం వైట్‌హౌస్‌ను సందర్శించబోతున్నారని వైట్‌హౌస్ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. జనవరి 27న Read more