asaram bapu

ఆశారాంకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిలు

ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూకు భారత అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. 2013లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన 86 ఏళ్ల ఆశారాంకు వైద్యకారణాలతో జోధ్‌పూర్‌ అత్యాచారం కేసులో 2025 మార్చి 31 వరకు బెయిలుపై విడుదల చేస్తున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. బెయిలుపై బయటకు వెళ్లాక సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయరాదని, మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆయన అనుచరులను కలవకూడదని..న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం ఆశారాంను ఆదేశించింది.

జోధ్‌పూర్ జైలుకు వచ్చిన ఆశారాం
డిసెంబర్ 18, 2024న నుంచి 17 రోజుల పెరోల్ పూర్తయిన తర్వాత ఇటీవల జనవరి 2న మరో అత్యాచారం కేసులో జోధ్‌పూర్ జైలుకు తిరిగి వచ్చాడు ఆశారాం. పెరోల్‌పై విడుదలైన సమయంలో పూణేలో ఉంటూ వైద్య చికిత్స చేయించుకున్నాడు. స్వయంగా తాను దైవమని ప్రకటించుకున్న ఆశారాం అసలు పేరు అసుమల్ సిరుమలాని హర్పలానీ.. రెండు రేప్ కేసుల్లో దోషిగా రుజువై యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు.

Related Posts
ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలు
ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలు

ర్యాగింగ్ పేరుతో జూనియర్ల పట్ల సీనియర్ల అత్యంత క్రూరంగా వ్యవహరించారు. వారిని నగ్నంగా మార్చి.. ప్రయివేట్ పార్ట్స్‌కు డంబెల్స్ వేలాడదీసి, జామెట్రీ బాక్సులోని కంపాస్‌తో పొడిచి పైశాచిక Read more

“జై భవాని”, “జై శివాజీ” నినాదాలతో ప్రధాని మోదీ ప్రసంగం ప్రారంభం..
modi 9

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ఫలితాలపై బీజేపీ కార్యాలయంలో తన ప్రసంగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన "జై భవాని" నినాదంతో ప్రసంగాన్ని Read more

గంటల వ్యవధిలోనే బిహార్‌లో మరో భూకంపం
Another earthquake in Bihar within hours

10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం.న్యూఢిల్లీ: ఉత్తరాదిన వరుస భూకంపాలు సంభవించాయి. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత Read more

భారత్ కు బయల్దేరిన మోదీ.
భారత్ కు బయల్దేరిన మోదీ.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 12, 13) జరిగిన ఈ పర్యటన అనంతరం మోదీ స్వదేశానికి తిరుగు Read more