rs praveen

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో దొంగతనం

బీఆర్ఎస్ నాయకుడు, మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ సంఘటన ఆయన సిర్పూర్ పర్యటన కోసం కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలోని తన నివాసంలో ఉన్న సమయంలో చోటుచేసుకుంది. రాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి దొంగలు ఇంట్లోకి చొరబడి, బీరువా తాళాలు పగులగొట్టి కొన్ని విలువైన పత్రాలను దొంగిలించారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు ఉన్నందున పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు. ఇంట్లో ప్రాముఖ్యమైన పత్రాలు మాత్రమే దొంగలించబడడం, ఈ సంఘటన వెనుక కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలను రేకెత్తిస్తుంది. ఈ సంఘటనపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, తెలంగాణలో దోపిడీ దొంగల పాలన కొనసాగుతుందని, తన ఇంటిలో జరిగిన దొంగతనంపై తెలంగాణ డీజీపీ పూర్తి దర్యాప్తు చేపట్టాలని కోరారు.

Related Posts
విషాదంలోనూ మంత్రులు వినోదాలు:కేటీఆర్
విషాదంలోనూ మంత్రులు వినోదాలు:కేటీఆర్

రాష్ట్రంలోని ప్రజలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటుంటే, విద్యార్థులకు కనీస ఆహారాన్ని కూడా సమకూర్చలేని దుస్థితిలో ప్రభుత్వ వ్యవస్థ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల కడుపు నింపే Read more

కాంగ్రెస్ కంటే కేసీఆర్‌కు ఎక్కువ విరాళాలు
కాంగ్రెస్ కంటే కేసీఆర్‌కు ఎక్కువ విరాళాలు

2023-24లో కాంగ్రెస్ కంటే కేసీఆర్ పార్టీకి ఎక్కువ విరాళాలు, బీజేపీ అగ్రస్థానం 2023-24లో దాతల నుండి రూ. 20,000 మరియు అంతకంటే ఎక్కువ విరాళాల రూపంలో దాదాపు Read more

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు కీలక తీర్పు
IAS officers did not get relief in the high court

హైదరాబాద్‌: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈరోజు తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హతపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని Read more

అల్లు అర్జున్ బెయిల్ రద్దు అవుతుందా?
pushpa 2

పుష్ప-2 రిలీజ్ సందర్బంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడం, మరో బాలుడు గాయపడి చికిత్స తీసుకుంటున్న ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఒకవైపు కోర్టు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *