women sewing

ఆంధ్రాలో మహిళలకు ఉచిత కుట్టుమిషన్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ మహిళలు సొంతంగా ఉపాధి పొందేందుకు కుట్టుపని ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఐతే.. ఈ పథకంపై అనుమానాలు కలుగుతున్నాయి. ఇందులో భారీ స్కామ్ జరగబోతోందనే అంచనాలు వస్తున్నాయి.
అలాగే.. 80వేల మంది బీసీ మహిళలకు.. ట్రైనింగ్ తర్వాత రూ.24వేల విలువైన కుట్టు మిషన్లను ఉచితంగా ఇవ్వాలి అని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పక్కా ప్లాన్ రెడీ చెయ్యమని బీసీ సంక్షేమ శాఖను ఆదేశించింది.

cartoon women

90 రోజులపాటూ ట్రైనింగ్
బీసీ మహిళళకు టైలరింగ్‌లో ట్రైనింగ్ ఇచ్చేందుకు.. కొన్ని సంస్థల నుంచి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఆ సంస్థలు స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా 80,000 మంది బీసీ మహిళలకు.. కుట్టుపనిలో 90 రోజులపాటూ ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ఒక్కో మహిళకూ రూ.24,000 విలువగల కుట్టుమిషన్‌ని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఇక్కడే ఈ పథకంపై అనుమానాలు కలుగుతున్నాయి.

పలు అనుమానాలు
కుట్టుమిషన్‌ ధరను ప్రభుత్వం రూ.24,000గా ఎందుకు నిర్ణయిస్తోంది అనేది తేలాల్సిన అంశం. కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మయోజన పథకంలో భాగంగా.. ఉచితంగా కుట్టుమిషన్ కొనుక్కోవడానికి రూ.15,000 ఇస్తోంది. అంటే.. రూ.15,000కి కుట్టుమిషన్ వస్తుంది. మార్కెట్‌లో సంప్రదాయ కుట్టుమిషన్ ధర రూ.10,000 నుంచి రూ.15,000 దాకా ఉంటోంది. అదే.. ఎలక్ట్రిక్ కుట్టుమిషన్ ధర రూ.20,000లోపే ఉంటోంది. మరి ఏపీ ప్రభుత్వం ఎందుకు కుట్టుమిషన్ ధరను రూ.24,000గా చెబుతోంది అనే ప్రశ్న తెరపైకి వస్తోంది.

Related Posts
పోసాని అరెస్టుతో వైసీపీ నిరసనలు.
పోసాని కృష్ణమురళి కేసుపై కీలక పరిణామాలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏపీ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేసిన ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో Read more

ఎన్టీఆర్ ట్రస్ట్ పై నారా భువనేశ్వరి వ్యాఖ్యలు
ఎన్టీఆర్ ట్రస్ట్ పై నారా భువనేశ్వరి వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్ సమాజ సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. Read more

Purandeswari: పవన్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు
Purandeswari పవన్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు

Purandeswari: పవన్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజకీయ వర్గాల నుండి శుభాకాంక్షల వెల్లువ ఊహించదగినదే. కూటమి పార్టీల నేతలు, Read more

Bhumana Karunakar Reddy : కాశీనాయన క్షేత్రం కూల్చివేతపై వైసీపీ ఆందోళన
Bhumana Karunakar Reddy కాశీనాయన క్షేత్రం కూల్చివేతపై వైసీపీ ఆందోళన

Bhumana Karunakar Reddy : కాశీనాయన క్షేత్రం కూల్చివేతపై వైసీపీ ఆందోళన ఆంధ్రప్రదేశ్‌లో కాశీనాయన క్షేత్రం కూల్చివేత వెనుక అసలు దోషులను బయటకు తీయాలని వైసీపీ అధికార Read more