pushpa 2

అల్లు అర్జున్ బెయిల్ రద్దు అవుతుందా?

పుష్ప-2 రిలీజ్ సందర్బంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడం, మరో బాలుడు గాయపడి చికిత్స తీసుకుంటున్న ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఒకవైపు కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రస్తావించడాన్ని కొందరు తప్పుపడుతుంటే.. మధ్యంతర బెయిల్‌పై ఉన్న వ్యక్తి ఈ కేసు విషయమై మీడియా సమావేశం నిర్వహించడాన్ని మరికొందరు తప్పుపడుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు కోసం పోలీసులు హైకోర్టు డివిజన్ బెంచ్ లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీల మధ్య వార్
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్రమేపి రాజకీయరంగు పులుముకుంది. కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్షాలుగా ఈ ఘటన మారిపోయింది. కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ వ్యవహారాన్ని తప్పుపడుతుండగా.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు తొక్కిసలాటలో మహిళ చనిపోవడం దురదృష్టకరమంటూనే అల్లు అర్జున్‌ను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని విమర్శిస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ నడుస్తున్నారని, బీఆర్‌ఎస్ అల్లు అర్జున్‌కు ఎందుకు మద్దతు ప్రకటిస్తోందంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
బెయిల్ రద్దవుతుందా?
అల్లు అర్జున్ కేసులో సాక్షులు, పిటిషనర్‌ను ప్రభావితం చేయగల వ్యక్తి అని, సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో కేసు విచారణ పూర్తయ్యేవరకు బెయిల్ ఇవ్వొద్దని, మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మధ్యంతర బెయిల్‌పై ఉన్నప్పుడు కేసు గురించి మీడియా ముందు మాట్లాడకూడదనే షరతులు ఉన్నప్పటికీ.. కోర్టు షరతులను అల్లు అర్జున్ ఉల్లంఘించారనే వాదనను ప్రభుత్వం తరపున న్యాయవాదులు వినిపించే అవకాశం లేకపోలేదు. దీంతో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దవుతుందా.. లేదంటే కోర్టు బెయిల్‌ను పోడిగిస్తుందా అనేది వేచి చూడాలి.

Related Posts
Telangana Budget : ఆరు గ్యారంటీలకు రూ.56,084 కోట్లు కేటాయించిన భట్టి విక్రమార్క
ఆరు గ్యారంటీలకు రూ.56,084 కోట్లు కేటాయించిన భట్టి విక్రమార్క

నేడు తెలంగాణ ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఈసారి రూ.3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. Read more

తుఫాన్‌ ఎఫెక్ట్‌..29 రైళ్లు రద్దు : రైల్వే శాఖ ప్రకటన..!
Typhoon effect.29 trains cancelled. Railway department announcement

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు కీలక సమాచారం: తుఫాను కారణంగా పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో దాదాపు Read more

Telangana: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి
goverment of telangana

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ మరియు వైస్‌ చైర్మన్‌ ల నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ప్రకారం, నల్సార్‌ Read more

Gummadi Narsaiah : గుమ్మడి నర్సయ్యకు అవమానం పై సీఎం రేవంత్ క్లారిటీ
cm revanth

తెలంగాణ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని గతంలో ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అవకాశం దొరకలేదని, తాను Read more