allu

అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనలో నిందితుల‌కు బెయిల్!

న‌టుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్ప‌డిన ఆరుగురు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఆదివారం నాడు బ‌న్నీ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేశ్, ప్రేమ్ కుమార్, ప్రకాశ్ దాడి చేసిన విష‌యం తెలిసిందే. దాంతో ఈ ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై బీఎన్ఎస్ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఈరోజు వారిని మెజిస్ట్రేజ్ ఎదుట హాజరపరచగా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా మెజిస్ట్రేజ్ వారికి బెయిల్ మంజూరు చేశారు.

Advertisements

ఇక నిన్న అక్రమంగా బన్నీ ఇంటి గేటులోకి ప్రవేశించి ఓయూ జేఏసీ నేతలు టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. పూల కుండీల‌ను ప‌గ‌ల‌గొట్టి విధ్వంసం సృష్టించారు.

రేవ‌తి మ‌ర‌ణానికి అల్లు అర్జునే కార‌ణ‌మంటూ నినాదాలు చేసుకుంటూ ఇంటి లోప‌లికి వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. దాంతో అల్లు అర్జున్ కుటుంబం ఇచ్చిన సమాచారం మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న ఆరుగురిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు.
పుష్ప-2 సినిమా విడుదల సందర్బంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె కుమారుడు శ్రీ తేజ గాయపడి ఆసుపత్రిలో కోలుకుంటున్న విషయం తెలుసు. ఈ కేసులో అల్లు అరెస్ట్ కావడం, బెయిల్ పై విడుదల అయ్యారు.

Related Posts
Congress Govt : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!
Another key decision by the Telangana government.

Congress Govt: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ట్యాంక్‌బండ్ పీపుల్స్ ప్లాజాలో నెల‌కొల్పిన నీరా కేఫ్‌ ను క‌ల్లుగీత పారిశ్రామిక కార్పొరేష‌న్‌ కు Read more

ప్రయాణికులకు ప్రైవేట్ బస్సుల షాక్
ప్రయాణికులకు ప్రైవేట్ బస్సుల షాక్

గత 20 రోజుల నుంచి ఫిట్‌నెస్ లేకుండా, నిబంధనలు పాటించకుండా, తెలంగాణ ప్రభుత్వానికి టాక్స్ కట్టకుండా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీయే అధికారులు స్పెషల్ డ్రైవ్ Read more

Government Job: ఒకేసారి మూడు ఉద్యోగాలు కొట్టిన రైతు బిడ్డ..ఎక్కడంటే?
Government Job: ఒకేసారి మూడు ఉద్యోగాలు కొట్టిన రైతు బిడ్డ..ఎక్కడంటే?

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలను సాధించటం ఎంతో ప్రతిష్ఠాత్మకమైన విషయం. పోటీ తీవ్రంగా ఉండటమే కాక, ఎంతో మంది నిరుద్యోగుల కలలను నిజం చేసే లక్ష్యంగా మారిన ప్రభుత్వ Read more

ఆదోనికి పోసాని కృష్ణమురళి
Krishna Murali, who gave it to Adoni

అమరావతి: వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళిని గుంటూరు జిల్లా జైలు నుంచి ఆదోని తరలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను దూషించిన ఘటనలో Read more

Advertisements
×