Allu Arjun Reaching Jubilee Hills Residence 380x214

అల్లుఅర్జున్ జైల్లో ఓ రాత్రి

అల్లుఅర్జున్ జైల్లో రాత్రి భోజనం చేయకుండా నిద్రించినట్లు తెలిసింది. రాత్రంతా జైల్లోనే ఉన్న అల్లుఅర్జున్ను ఖైదీలందరూ బ్యారక్లకు వెళ్లిన తర్వాత మంజీర బ్యారక్కు తరలించారు. జైలు అధికారులు ఫుడ్ ఆఫర్ చేసినా బన్నీ తీసుకోలేదని సమాచారం. ఆయనకు కొత్త రగ్గు, దుప్పటి ఇవ్వగా సాధారణ ఖైదీలాగే నేల మీద పడుకున్నట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో నిన్న మధ్యాహ్నం అరెస్ట్ అయిన ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత కాసేపటికే రూ. 50 వేల పూచీకత్తుతో హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. రిమాండ్ విధించినప్పుడు న్యాయాధికారి ఆయనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మర్నాడు మాత్రమే అందుతాయి. దీంతో అల్లు కొద్దిసేపటి క్రితం విడుదల అయి ఇంటికి చేరుకున్నారు.

Advertisements
Related Posts
Rain Alert: నేడు రేపు తెలంగాణకు భారీ వర్ష సూచన
నేడు రేపు తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు శుక్ర, శనివారాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సంగారెడ్డి, వికారాబాద్, Read more

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
MLC election schedule released

హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఎమ్మెల్యే ఎన్నికల షెడ్యూల్‌ను తెలంగాణ ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఎన్నికల సంఘం Read more

Telangana Budget 2025-26 : శాఖల వారిగా కేటాయింపులు ఇలా !
Telangana Budget 2025 26

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. అనంతరం, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క Read more

Rationcards: రేషన్ కార్డుదారులకు మంత్రి కీలక ప్రకటన
Rationcards: కొత్త రేషన్ కార్డుల మంజూరుపై ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త అందించారు. శుక్రవారం ఆయన హుజూర్ నగర్‌లో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి, ఈ సందర్భంగా Read more

×