hydra అల్కాపురిలో అక్రమ షట్టర్లపై హైడ్రా పంజా

అల్కాపురిలో అక్రమ షట్టర్లపై హైడ్రా పంజా

హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా, అల్కాపురిలోని కొన్ని అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా విసిరింది. ‘మార్నింగ్ రాగా’ అపార్ట్ మెంట్ లో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన షట్టర్లను (దుకాణాలను) హైడ్రా నేడు తొలగించింది. ఈ షట్టర్లకు సంబంధించి మణికొండ మున్సిపాలిటీ అధికారులు నవంబరు 27నే నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో షట్టర్లను తొలగించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ, ఆ షట్టర్ల సొంతదారుల నుంచి స్పందన లేదు. దాంతో, మున్సిపల్ అధికారులు ఈ విషయాన్ని హైడ్రాకు నివేదించగా, హైడ్రా రంగంలోకి దిగి ఆ షట్టర్లను కూల్చివేసింది.
ఈ సందర్భంగా, అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. హైడ్రా సిబ్బందిని, పోలీసులను అడ్డుకునేందుకు అపార్ట్ మెంట్ వాసులు ప్రయత్నించారు. అయితే, ఆ షట్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే తొలగిస్తున్నామని హైడ్రా సిబ్బంది స్పష్టం చేశారు. గత కొంతకాలంగా హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా వున్న కట్టడాలను కూల్చివేస్తున సంగతి తెలిసిందే. ఇటీవల హైకోర్ట్ హైడ్రా కూల్చివేతపై నిబంధనలు పాటించాలని పెర్కొంది.

Advertisements

Related Posts
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
Amaravati capital case postponed to December says supreme court jpg

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఏఎస్పీ మేకల Read more

ప్రమాదం నుండి తపించుకున్న పొంగులేటి
ప్రమాదం నుండి తపించుకున్న పొంగులేటి1

రెవెన్యూ మంత్రి వరంగల్ నుంచి ఖమ్మం తిరిగి వస్తుండగా తిరుమలయపాలెం వద్ద ఈ ఘటన జరిగింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం సాయంత్రం ఖమ్మం Read more

రేవంత్ రెడ్డి నీ సవాల్ కు నేను రెడీ – కిషన్ రెడ్డి
kishan reddy hydraa

మూసీ పరివాహక ప్రాంతంలో పేదల ఇండ్ల కూల్చివేతపై తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, Read more

బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు!
Bandi Sanjay Kumar

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ముందు నుంచి ఊహించిందేనని అన్నారు. మేధావివర్గం అంతా బీజేపీకి Read more

Advertisements
×