Donald Trump as the 47th President of America

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్..

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ మేరకు అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకొనున్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడు కావడం ఇది రెండోసారి. ఈ ఎన్నికల్లో ట్రంప్ ఇప్పటికే 277 సీట్లలో విజయం సాధించారు. అధ్యక్షుడు కావడానికి మ్యాజిక్ ఫిగర్ 270 కాగా ఆయన 7 స్థానాల ఎక్కువగానే గెలుచుకున్నారు. ఇక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 266 సీట్లతో సరిపెట్టుకున్నారు.

ఇంకా 35 చోట్ల కౌటింగ్ కొనసాగుతోంది. ట్రంప్ గెలుపుతో రిపబ్లికన్లు సంబురాలు చేసుకుంటున్నారు. ట్రంప్ ప్రచారం, ఆయనపై జరిగిన హత్యాయత్నంతో ఆయనకు మద్దతు పెరిగింది. అంతే కాదు డిబెట్ లో పై చేయి సాధించడంతో ఆయన ముందుకు దూసుకెళ్లాడు. అయితే డెమోక్రటిక్ పార్టీ తమ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ తప్పించి కమలా హారిస్ కు అవకాశం ఇచ్చింది. దీంతో ట్రంప్ కు కాస్త ఆధిక్యం తగ్గింది. హారిస్, ట్రంప్ హోరాహోరీగా ప్రచారం చేశారు. ముందుస్తు సర్వేల్లో

కమలా హారిస్ ముందు ఉండగా.. చివరి సర్వే ట్రంప్ ఆధిక్యంలోకి దూసుకొచ్చాడు. ట్రంప్ ప్రచారాన్ని హారిస్ గట్టిన తిప్పికొట్టినా.. ప్రజలు ట్రంప్ వైపే మొగ్గు చూపారు. ముఖ్యంగా యువ ఓటర్లంతా రిపబ్లికన్ పార్టీ వైపే వెళ్లారు. దీంతో ట్రంప్ విజయం ఖాయమైంది. కీలకమైన స్వింగ్ రాష్ట్రాలైన జార్జియా, పెన్సిల్వేనియాలను కైవసం చేసుకున్న తర్వాత ట్రంప్ విజయం దాదాపు ఖరారు అయింది. ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికలలో 538 ఎలక్టోరల్ ఓట్లలో 304 గెలుచుకున్నప్పటికీ ప్రజాదరణ పొందిన ఓట్లను గెలుచుకోవడంలో విఫలమయ్యారు.

రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్‌కు విజయ ప్రసంగంలో ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్ తన ప్రసంగాన్ని మధ్యలోనే వదిలేసి భార్య చెంపపై ముద్దుపెట్టుకున్నాడు. “దేవుడు నా ప్రాణాన్ని ఒక కారణంతో తప్పించాడు” అని ట్రంప్ చెప్పారు. డోనాల్డ్ ట్రంప్ తన “విక్టరీ స్పీచ్”లో ఒక హత్యాయత్నాన్ని గుర్తుచేసుకుంటూ “దేవుడు ఒక కారణం కోసం నా ప్రాణాలను విడిచిపెట్టాడు” అని పేర్కొన్నాడు.

Related Posts
‘శక్తి టీమ్స్’ను ప్రారంభించిన చంద్రబాబు
'శక్తి టీమ్స్'ను ప్రారంభించిన చంద్రబాబు

'శక్తి టీమ్స్'ను ప్రారంభించిన చంద్రబాబు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత కోసం అనేక కీలక కార్యక్రమాలను ప్రకటించింది. మహిళా సంక్షేమానికి బలమైన Read more

విశాఖ సెంట్రల్ జైల్లో 66మందిపై బదిలీ వేటు
vizag central jail

విశాఖ సెంట్రల్ జైల్లో ఇటీవల సంభవించిన వివాదం నేపథ్యంలో 66మందిపై బదిలీ చర్యలు చేపట్టారు. జైలు అధికారులు ఖైదీల ఎదుట తమను దుస్తులు విప్పించి తనిఖీ చేయాల్సి Read more

సుంకాలు తగ్గించేందుకు భారత్ సుముఖం: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాల కారణంగా ప్రపంచ వాణిజ్య యుద్ధం పెరిగే ప్రమాదం నెలకొంది. అమెరికాలోకి దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై ట్రంప్ 25% భారీ సుంకాన్ని విధించారు. డోనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడైన తర్వాత మొదటిసారిగా అమెరికా కూడా యూరోపియన్ యూనియన్ పై అధిక సుంకాలను విధించింది. ఇలా జరిగిన కొన్ని గంటల్లోనే యూరోపియన్ యూనియన్ కూడా అమెరికన్ వస్తువులపై సుంకాలను ప్రకటించింది. ట్రంప్ చర్య తీసుకున్న కొన్ని గంటల తర్వాత, కెనడా కూడా అమెరికా నుండి దిగుమతి చేసుకునే $20 బిలియన్ల విలువైన వస్తువులపై 25% సుంకాన్ని విధించింది. ఈ సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి. ట్రంప్ రెండవ పదవీకాలంలో మొదటిసారిగా అన్ని దేశాల నుండి ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలు విధించారు. అయితే ఉక్కు, అల్యూమినియంపై సుంకాలు విధించడం ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. అది అమెరికా ఉక్కు ఇంకా అల్యూమినియం పరిశ్రమలకు ఊతం ఇవ్వవచ్చు కానీ అమెరికన్ తయారీదారులకు కీలకమైన పదార్థానికి ధరలు పెరుగుతాయి. ఈ పెరిగిన ఖర్చును వినియోగదారులపై కూడా వేయవచ్చు. దీనివల్ల కలిగే నష్టమే ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉండవచ్చు. ప్రమాదంలో లక్ష ఉద్యోగాలు : ముఖ్యంగా దీని వల్ల పరిశ్రమలకు భారీ ఎదురుదెబ్బ తగలవచ్చు. ఎందుకంటే దేశంలోని అతిపెద్ద అల్యూమినియం కంపెనీలలో ఒకటైన అల్కోవా సిఇఒ విలియం ఒప్లింగర్ గత నెలలో ట్రంప్ సుంకాల వల్ల దేశంలో 1,00,000 ఉద్యోగాలు కోల్పోవచ్చని హెచ్చరించారు. ఇందులో అల్యూమినియం పరిశ్రమలోని 20,000 ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అంతకుముందు ట్రంప్ చైనా, మెక్సికో, కెనడా అనే మూడు దేశాలపై మాత్రమే సుంకాలు విధించారు. కెనడా కూడా బుధవారం ఉదయం అమెరికాపై రియాక్షన్ ప్రకటించింది. వీటిలో ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులు వంటి $20.1 బిలియన్ల విలువైన US వస్తువుల దిగుమతులపై 25% సుంకం ఉంది. కెనడా కూడా కంప్యూటర్లు, క్రీడా పరికరాలు, ఇనుప ఖనిజ ఉత్పత్తులతో సహా US నుండి బిలియన్ల డాలర్ల విలువైన దిగుమతులను టార్గెట్ చేసింది. దేశ ఆర్థిక మంత్రి డొమినిక్ లెబ్లాంక్ మాట్లాడుతూ మేము మా ప్రతిఘటన చర్యలను కొనసాగిస్తాము ఇంకా ఏప్రిల్ 2న వాటిని మరింత విస్తరిస్తాము అని అన్నారు. యూరప్ అండ్ ఆస్ట్రేలియా: అమెరికా సుంకాలు అన్యాయమని పేర్కొంటూ యూరోపియన్ యూనియన్ కూడా 28 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా వస్తువులపై సుంకాలు విధించింది. ఇందులో పడవలు, బోర్బన్ అండ్ బైక్స్ పై సుంకాలు ఉన్నాయి. ఈ సుంకాలు ఏప్రిల్ నుండి అమల్లోకి వస్తాయని ఒక ప్రకటన తెలిపింది. బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం, గత సంవత్సరం EU ఇనుము ఇంకా ఉక్కు ఎగుమతులకు యునైటెడ్ స్టేట్స్ రెండవ అతిపెద్ద గమ్యస్థానంగా ఉంది. అదేవిధంగా, 2023లో యూరోపియన్ అల్యూమినియం కొనుగోలుదారులలో అమెరికా రెండవ అతిపెద్దది.

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడానికి భారత్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికన్ ఉత్పత్తులపై అత్యధికంగా సుంకాలు వేసే దేశంగా భారత్‌ను అభివర్ణించే ట్రంప్.. Read more

గగన్ యాన్ కోసం సముద్రయానం పరీక్షలు
Sea trials for the Gaganyaan

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్ యాన్ ముందస్తు పరీక్షలు. పరిశోధనలు ముమ్మరం చేసింది. మరోసారి సముద్రంలో రికవరి పరిశోధనలు మొదలయ్యాయి. భారతీయ నావికాదళం, ఇస్రో సంయుక్తంగా Read more