bird flu

అమెరికాలో బర్డ్ ఫ్లూతో తొలి మరణం

ప్రపంచాన్ని హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్‌‌ఎంపీవీ) వైరస్ భయపెడుతున్న వేళ అమెరికాలో తొలి బర్డ్‌ ఫ్లూ (హెచ్5ఎన్1) మరణం కేసు నమోదు కావడం మరింత కలవరానికి గురిచేస్తున్నది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి.
లూసియానాలో బర్డ్‌ ఫ్లూ (హెచ్5ఎన్1 వైరస్ సోకిన ఓ వ్యక్తి (65) చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతోపాటు పలు ఇతర సమస్యలతో డిసెంబరు నెల మధ్యలో ఆయన ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారించారు. దేశంలో ఇదే తొలి సీరియస్ బర్డ్ ఫ్లూ కేసు అని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇటీవల ప్రకటించింది. తాజాగా ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.

Advertisements

పెరట్లో ఉన్న అడవి పక్షులు, మందకు దగ్గరగా వెళ్లడం వల్లే ఆయన ఈ వైరస్ బారినపడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టుగా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. కాగా, గతేడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అమెరికాలో 66 బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.

Related Posts
కాంగోలో ఫెర్రీ ప్రమాదం: 38 మంది మృతి
overloaded ferry

ఈశాన్య డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఒక భారీ ప్రమాదం జరిగింది. ఇది ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. బుసిరా నదిలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఈ Read more

హమాస్‌ను నిర్మూలించాలి: రూబియో
హమాస్‌ను నిర్మూలించాలి: రూబియో

US విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాలను పూర్తిగా సమర్థిస్తూ, హమాస్‌ను నిర్మూలించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. కాల్పుల విరమణకు సంబంధించిన భవిష్యత్తుపై Read more

JaiShankar :డాలర్ ను బలహీనపరిచే భావన మాకు లేదు: జైశంకర్
JaiShankar :డాలర్ ను బలహీనపరిచే భావన మాకు లేదు: జైశంకర్

భారతదేశం డాలర్ ని బలహీనపరిచే ప్రయత్నాలు చేయలేదని, బ్రిక్స్ సభ్య దేశాల ఉమ్మడి కరెన్సీపై భారత్ ప్రమేయం లేదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టంగా వెల్లడించారు. Read more

అదానీ గ్రూపుపై రిపోర్ట్ ఇచ్చిన సంస్థ మూసివేత
adani

ఒకప్పుడు తన సంచలన అధ్యయన నివేదికలతో భారత్ లో అదానీ గ్రూప్ కు చుక్కలు చూపించిన అమెరికా పెట్టుబడులు, పరిశోధన సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ అనూహ్యంగా Read more

×