A massive fire broke out at

అబిడ్స్‌లోని టపాసుల షాప్ లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో మయూర్ పాన్ షాపు సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో క్రాకర్స్‌ షాపులో మంటలు చెలరేగడం ప్రారంభమైంది. మంటలు బాగా ఎగిసిపడి చుట్టుపక్కల వ్యాపించడంతో, పక్కనే ఉన్న హోటల్‌కి కూడా తీవ్ర నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో దాదాపు 10 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి భయంతో అక్కడి నుంచి పరుగు తీశారు.

ప్రస్తుతం ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి కేసు నమోదుచేసి, దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ప్రాణ నష్టం, మరియు ఆస్తి నష్టం గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related Posts
రాష్ట్ర పండుగగా ‘సదర్’: ప్రభుత్వం జీవో జారీ
Sadar as state festival of telangana govt issued go

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం యాదవ్‌ సోదరులకు శుభవార్త తెలిపింది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో యాదవులు ఎంతో ఘనంగా నిర్వహించే సదర్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. Read more

సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు: సీఎం చంద్రబాబు
Roads without potholes in the state by Sankranti. CM Chandrababu

అమరావతి: సీఎం చంద్రబాబు పరవాడలో గుంతలు పడిన రోడ్లను పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంతల రోడ్లు నరకానికి రహదారులు అని.. రోడ్ల Read more

జేఈఈ అడ్వాన్స్డ్: సుప్రీంకోర్టు తీర్పు
జేఈఈ అడ్వాన్స్డ్: సుప్రీంకోర్టు తీర్పు

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (అడ్వాన్స్డ్) కోసం ప్రయత్నాల సంఖ్యను మూడు నుండి రెండుకు తగ్గించే నిర్ణయాన్ని సవాలు చేసిన విద్యార్థులకు సుప్రీంకోర్టు శుక్రవారం ఉపశమనం కలిగించింది. నవంబర్ Read more

దిల్ రాజు ఇంట్లో రెండో రోజు కూడా ఐటీ రైడ్స్
it rides dil raju

టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థలపై రెండో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. SVC నిర్మాణ సంస్థ యజమానులు దిల్ రాజు, శిరీష్, మైత్రీ మూవీ మేకర్స్ Read more