Minister ponguleti srinivasa reddy

అధికారుల మీద దాడి..మనమీద మనం దాడి చేసుకునట్లే: మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌ : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వికారాబాద్‌ ఘటనపై మరోసారి మాట్లాడుతూ..బీఆర్‌ఎస్‌ నేతలపై మండిపడ్డారు. వికారాబాద్ జిల్లాకు ఫస్ట్ మేజిస్ట్రేట్‌గా ఉన్న కలెక్టర్‌పైనే హత్యాయత్నం చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. అధికారుల మీద దాడి జరగడం మనమీద మనం దాడి చేసుకునట్లేనని అన్నారు. రైతుల ముసుగులో కొంతమంది గులాబీ గూండాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. కుట్రపూరితంగా అధికారులను రైతులకు దూరం చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారని మండిపడ్డారు. గులాబీ గూండాల కుట్రలను రైతాంగం అర్ధం చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

ప్రజలను కాపాడుకున్నట్లే, అధికారులను కాపాడుకోలేకపోతే పని చేయడానికి ఏ అధికారి ముందుకు వస్తారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కూడా ఇదే పద్ధతి పాటించారా అని నిలదీశారు. ఏం తప్పుచేశారని ఆనాడు ఖమ్మంలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసి జైల్లో పెట్టారని ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌లో రైతులను దేశద్రోహులుగా చిత్రీకరించారని ఆరోపించారు. పిల్లా, పాపా, ముసలి అనే తేడా లేకుండా రాత్రికి రాత్రి వారిని అరెస్ట్ చేసి సంకెళ్లు వేసిన సంగతి మరిచారా అని ప్రశ్నించారు. కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో దళితులకు బేడీలు వేసిన సంగతి మరిచిపోయారా అని నిలదీశారు. లగచర్లలో ఆ పరిస్ధితి లేదు కదా అని మంత్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.

కాగా, రైతులను నష్టపెట్టాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వారి సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని తెలిపారు. రైతుల ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. లగచర్ల సంఘటను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని అన్నారు. ఈ రోజు అధికారులపై దాడి జరిగినట్లుగానే ..రేపు రాజకీయ నాయకులు, ప్రజలపై దాడి జరిగితే ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

Related Posts
పోలవరం ఆలస్యానికి కారణం అతడే – మంత్రి నిమ్మల
polavaram

పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగనేనని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. గోదావరి, కృష్ణా జలాలపై మాట్లాడే నైతిక హక్కు Read more

రేషన్ కార్డుల పంపిణీపై తాజా నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ఇందు కోసం ఇప్పటికే లబ్ది దారుల నుంచి సేకరించిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసింది. అన్ని Read more

తెలంగాణలో నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభం..
House to house survey to start in Telangana from today

హైదరాబాద్‌: తెలంగాణలో ఈరోజు నుండి ఇంటింటి సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలెక్టర్లు ఏనుమరెటర్లతో విస్తృతంగా మాట్లాడాలని అన్నారు. శనివారం Read more

ముస్లిం నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసొచ్చిన వ్యూహం ఇదే..!
ముస్లిం నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసొచ్చిన వ్యూహం ఇదే..!

ఢిల్లీలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న 7 నియోజకవర్గాల్లో బీజేపీ అనూహ్యంగా మంచి ప్రదర్శన చేసింది. మొదట ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆధిక్యంలో ఉన్నా, కౌంటింగ్ Read more