nani babu

అధికారం ఎల్లకాలం ఉండదు చంద్రబాబూ – పేర్ని నాని

ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైసీపీ నేతలు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ‘అధికారం ఎల్లకాలం ఉండదు చంద్రబాబూ.. గుర్తుంచుకో’ అని పేర్ని నాని సవాల్ విసిరారు. శ‌నివారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలను చంద్రబాబు సర్కార్‌ గాలికొదిలేసిందని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే తమ పార్టీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుందంటూ నాని మండిపడ్డారు. తప్పుడు కేసులతో వైసీపీ శ్రేణులను వేధించడానికే పోలీసులను వాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. పాత కేసులను తిరగదోడి.. తప్పుడు కేసులు పెడుతున్నారని , గన్నవరంలో 8 మంది వైసీపీ నేతలను అక్రమంగా కేసుల్లో ఇరికించారు. న్యాయమూర్తి 307 కేసును తొలగించారు. కానీ బెయిల్ విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పచ్చ చొక్కాల ఒత్తిడికి లొంగిపోయారు. కుంటిసాకులతో రెండురోజుల పాటు కాలయాపన చేసి పోలీస్ కస్టడీ కోరారు. రెండు సార్లు విచారణ అయ్యాక ఏముందని పోలీస్ కస్టడీకి కోరుతున్నార‌ని పేర్ని నాని ప్రశ్నించారు.

అమాయకులను తెచ్చి ముద్దాయిలను చేశారు. వైసీపీ జెండా, వైయ‌స్ జగన్ బొమ్మ పెట్టుకుని తిరగకుండా చేయాలని చూస్తున్నారు. అడ్డగోలుగా పోలీసులను వాడుతున్నారు. పాతకేసులను తిరగదోడుతున్నందుకు డీజీపీకి మా సూటిప్రశ్న. పాతకేసులకు సంబంధించి ఎస్సై, సీఐలను సస్పెండ్ చేశారా?. తప్పుడు ఉద్యోగం చేశావని ఒక్కరిపైనైనా చర్యలు తీసుకున్నారా?. చేసేవి దొంగ పనులు కాబట్టి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఒక్కొక్కరి పై 10, 20 కేసులు పెడుతున్నారు.చంద్రబాబు గుర్తించుకో..ఎల్లకాలం అధికారం ఉండ‌ద, ప్రభుత్వాలు శాశ్వతం కాద‌న‌ని నాని అన్నారు. ఈ రోజు పసుపు చొక్కేలేసుకుని అక్రమంగా వ్యవహరిస్తున్న అధికారుల‌పై తప్పకుండా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంద‌ని ఆయ‌న హెచ్చరించారు.

Related Posts
రూ. 2 కోట్లు నష్టపోయిన యువకుడు – యూట్యూబర్ ‘లోకల్ బాయ్’ నాని అరెస్ట్
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లతో మోసాలు – యూట్యూబర్ నాని అరెస్ట్

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లతో మోసాలు – యూట్యూబర్ నాని అరెస్ట్ వివరాలు:ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న విశాఖపట్నానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ వాసుపల్లి నాని అలియాస్ Read more

ఏపీలో మరో రెండు బీసీ గురుకులాలు
Two more BC Gurukulas in AP

ఏపీలో ప్రస్తుతం 107 బీసీ గురుకులాలు ఉన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు కొత్త గురుకులాలను ప్రారంభించనుంది. ఈ గురుకులాలు Read more

నేడు చార్మినార్‌ కు సీఎం రేవంత్‌ రెడ్డి.. భారీ బందోబస్తు ఏర్పాట్లు
cm revanth reddy district tour

హైదరాబాద్‌: ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రక చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ 34వ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ Read more

పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు
Anticipatory bail granted to Perni Nani

అమరావతి: మాజీమంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. నానికి హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రేషన్‌ బియ్యం మిస్సింగ్‌ కేసులో ఏ6గా ఉన్నారు పేర్ని Read more