atul subhash2 1733912740

అతుల్ ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్ట్ విచారం

ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్ కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసుకింద నమోదయినా సెక్షన్ 498ఏపై చర్చకు దారితీసింది. ఈ సెక్షన్ దుర్వినియోగంపై స్వయంగా సుప్రీంకోర్టే ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి అతుల్ లాయర్ దినేశ్ మిశ్రా కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. కుటుంబ న్యాయస్థానం ఆదేశాలతో సంతృప్తి చెందకపోతే ఆశ్రయించేందుకు మరిన్ని ఫోరమ్‌లు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అతుల్ ఆత్మహత్యపై అడ్వకేట్ ఆన్ రికార్డ్ (ఏవోఆర్) నిశాంత్ కేఆర్.శ్రీవాస్తవ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు కఠినమైన, సుదీర్ఘ న్యాయవిచారణ, ఆలస్యమైన న్యాయవిధానం వంటివి ఇటువంటి ఘటనలకు కారణమవుతున్నట్టు అభిప్రాయపడ్డారు. వరకట్న వేధింపులకు సంబంధించిన సెక్షన్ 498ఏ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తక్షణ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని క్రిమినల్ లాయర్ వికాశ్ పహ్వా తెలిపారు. అతుల్ కేసును ఆయన ‘చాలా తీవ్రమైనది’గా అభివర్ణించారు.
భార్యాభర్తలిద్దరూ ఆర్థికంగా స్థిరపడినవారేనని, అతుల్ భార్య ఢిల్లీలో బాగానే సంపాదిస్తోందని, బెంగళూరులో అతుల్ నెలకు రూ. 84 వేలు సంపాదిస్తున్నాడని పేర్కొన్నారు. అయితే, కుమారుడి పోషణ కోసం నెలకు రూ. 40 వేలు చెల్లించాలని అతుల్‌ను కుటుంబ న్యాయస్థానం ఆదేశించినట్టు తెలిపారు. మిగతా రూ. 44 వేలతో అతుల్ బెంగళూరులో అద్దెలు కట్టుకుని, కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఆమె బాగా సంపాదించి, స్థిరపడి ఉన్నందున విడిపోయిన భార్యకు భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించలేదని లాయర్ దినేశ్ మిశ్రా తెలిపారు. ఫ్యామిలీ కోర్టు ఆదేశాలపై అతుల్ సంతృప్తి చెందకుంటే పై కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని చెప్పారు.
ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత వుంది. కింది కోర్టులు సంతృప్తి తీర్పులు ఇవ్వనపుడు పైకోర్టులను ఆశ్రయి చవచ్చు అని సుప్రీంకోర్టు తెలిపింది.

Advertisements
Related Posts
YogiAdityanath:బుల్డోజర్ న్యాయాన్ని సమర్థించుకున్న యోగి ఆదిత్యనాథ్​
YogiAdityanath:బుల్డోజర్ న్యాయాన్ని సమర్థించుకున్న యోగి ఆదిత్యనాథ్​

యోగి ఆదిత్యనాథ్ తన 'బుల్డోజర్ న్యాయాన్ని' మరోసారి సమర్థించుకున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వ్యక్తులకు, వారికి అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పడం సరైన చర్య అని ఆయన Read more

Lulu Group : అబుదాబిలో ప్రధాని ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
Lulu Group అబుదాబిలో ప్రధాని ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత

Lulu Group : అబుదాబిలో ప్రధాని ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత టీవీ9 నెట్‌వర్క్ 'వాట్ ఇండియా థింక్స్ టుడే' మూడవ ఎడిషన్ మార్చి 28న Read more

వీరేంద్ర సెహ్వాగ్ విడాకులపై రూమర్స్
వీరేంద్ర సెహ్వాగ్ విడాకులపై రూమర్స్

ఇటీవల కాలంలో సెలబ్రిటీల విడాకులు విపరీతంగా పెరుగుతున్నాయి. సినీ రంగంలో విడాకులు ఓ సాధారణ విషయంగా మారిపోగా, ఇప్పుడు అదే ట్రెండ్ క్రికెట్ ప్రపంచాన్ని కూడా గట్టిగా Read more

MSC Turkiye : అదానీ విజింజం ఓడరేవుకు అతిపెద్ద కార్గో షిప్‌..విశేషాలు ఇవే
eco friendly container ship

ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్‌లలో ఒకటైన ఎంఎస్‌సీ తుర్కియే (MSC TÜRKIYE) బుధవారం అదానీ గ్రూప్ అభివృద్ధి చేస్తున్న కేరళ రాష్ట్రంలోని విజింజం ఓడరేవుకు చేరుకోవడం విశేషం. Read more

×