Yunus meets with Chinese President Jinping

Muhammad Yunus : ముహమ్మద్ యూనస్‌-చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ: ఏం చర్చించారు?

Muhammad Yunus : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం వారిద్దరూ సమావేశమయ్యారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం యూనస్‌ చైనాకు వెళ్లారు. బుధవారం హైనాన్ ప్రావిన్స్‌లో బోవో ఫోరమ్‌ ఫర్ ఆసియా వార్షిక సదస్సులో యూనస్ పాల్గొన్నారు. అనంతరం చైనా రాజధాని బీజింగ్ చేరుకొని, ఆ దేశ ప్రతినిధులతో సమావేశమయ్యారు. డ్రాగన్ ఇస్తున్న రుణాలకు వడ్డీలను తగ్గించాలని, ఆ దేశ నిధులు అందుతున్న ప్రాజెక్టులకు కమిట్‌మెంట్ ఫీజ్‌ను మాఫీ చేయాలని కోరారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలన్నారు. జపాన్‌, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు తర్వాత చైనా దగ్గరినుంచే బంగ్లా ఎక్కువగా రుణాలు పొందుతోంది. 1975 నుంచి ఇప్పటివరకు పొందిన అప్పులు 7.5 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

Advertisements
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో యూనస్‌

అనేక అవగాహన ఒప్పందాలు

కాగా, షేక్‌ హసీనా ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత నుంచి భారత్‌-బంగ్లాదేశ్‌ సంబంధాలు ఒత్తిడికి గురవుతున్నాయి. చిరకాల మిత్రదేశమైన భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం పాకిస్థాన్‌, చైనాకు దగ్గరవుతూ వస్తోంది. ఇక, ఈ పర్యటన యొక్క ప్రధాన దృష్టి ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం ఈ పర్యటన సందర్భంగా అనేక (అవగాహన ఒప్పందాలు) కుదుర్చుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఈ అవగాహన ఒప్పందాలు ఎక్కువగా ఆర్థిక సహకార రంగాలను కవర్ చేస్తాయి, “చర్చ యొక్క ప్రధాన కేంద్రాలలో ఒకటి మా అంకితమైన చైనీస్ ఆర్థిక మండలంలో చైనా నుండి మరిన్ని పెట్టుబడులను తీసుకురావడం” అని బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. చైనా పర్యటన చాలా ముఖ్యమైనది. ప్రధాన సలహాదారుగా యూనస్ ఏ దేశానికైనా చేసిన మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది “చైనాతో సంబంధాన్ని పెంచుకోవడానికి మరియు సహకారానికి సంబంధించిన కొత్త రంగాలను అన్వేషించడానికి బంగ్లాదేశ్‌కు ఇది ఒక అవకాశం”

Related Posts
భారత్-పాక్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ
భారత్-పాక్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ

భారత్-పాక్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్ భారతదేశం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో లీగ్ స్టేజ్ మ్యాచ్‌లో ఫిబ్రవరి 23న తలపడనుంది. ఈ రెండు Read more

ట్రంప్, పుతిన్ ఉచ్చులో జెలెన్స్కీ?
ట్రంప్, పుతిన్ ఉచ్చులో జెలెన్స్కీ?

ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ఉక్రెయిన్ భవిష్యత్తు సమావేశం నుంచి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్స్కీని కావాలనే తప్పించారని విశ్లేషకులు అంటున్నారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ లేదా Read more

అరెస్ట్‌ వార్తలపై కేటీఆర్ ట్వీట్
KTR tweet on the news of the arrest

హైదరాబాద్‌: తనపై నమోదైన కేసులపై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఈ మేరకు గుడ్ లక్ చిట్టినాయుడు అంటూ కేటీఆర్‌ చురకలు అంటించారు. శునకానందం పొందాలనుకుంటే.. నీ Read more

NSE : NSE విలువ రూ.410 లక్షల కోట్లు
NSE1

నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ (NSE) లోని 2,710 కంపెనీల మార్కెట్ విలువ రూ.410.87 లక్షల కోట్లకు చేరుకుంది. గతేడాది మార్చి 31 నాటికి ఎన్ఎస్ఈ విలువ రూ.384.2 Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×