హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ప్రాంతంలో యూట్యూబర్ గిరీష్ దారమోని పై జరిగిన దాడి కేసు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మొత్తం 45 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా మిగిలిన 40 మందిని పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతోంది.వివాదాస్పద అంశాల్లో దూరి కేసులు దాకా తెచ్చుకుంటున్నారు కొంతమంది యూట్యూబర్లు. అయితే హద్దు దాటితే సెక్షన్లతో కొడుతోంది డిపార్ట్‌మెంట్. తాజాగా తెలుగు యూట్యూబర్ పై పలువురు యువకులు, మహిళలు మూకుమ్మడిగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అత్తాపూర్ రాధకృష్ణానగర్ లో జరిగింది.
దర్యాప్తు
యూట్యూబర్‌పై జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యూట్యూబర్ గిరీష్‌పై దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీస్ సిబ్బంది విధులను అడ్డుకోవడంతో పాటు దాడి చేసిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు. మొత్తం 45 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో 40 మంది కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. మరోవైపు తనపై, తన కార్యాలయంపై ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని ఆరోపించారు యూట్యూబర్ గిరీష్.
చిత్రగుప్త్
రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్ గూడలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న యూట్యూబర్ గిరీష్ దారమోని, ద చిత్రగుప్త్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బ్లాక్‌మెయిల్‌కి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై నిలదీసేందుకు ఇంటికెళ్లిన వారిపై కారంపొడితో గిరీష్ దాడి చేశారు.దీనితో అక్కడున్న యువకులు, మహిళలు మూకుమ్మడిగా గిరీష్ పై దాడి చేసి గిరీష్ మెడలో చెప్పుల దండేసి ఊరేగించారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో యూట్యూబ్ అనేది ఒక ప్రముఖ మీడియా వేదికగా మారింది. అయితే, కంటెంట్ క్రియేషన్ చేస్తుండగా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. లేకుంటే లీగల్ ఇష్యూలు, సమాజంలో ప్రతికూల ప్రభావం ఎదురయ్యే అవకాశం ఉంటుంది.వాస్తవం లేని వార్తలు ప్రసారం చేయకూడదు.వ్యక్తిగతంగా ఎవరినైనా టార్గెట్ చేసి దుష్ప్రచారం చేయకూడదు.తప్పుడు ఆరోపణలు చేస్తే సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉంది.మత, కుల, రాజకీయ అంశాలపై ప్రసారం చేయకూడదు.అశ్లీల, హింసాత్మక కంటెంట్‌ను ప్రచారం చేయడం చట్టపరంగా నేరం.సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని బాధ్యతాయుతమైన ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలి.ఇతరులను అవమానించే రీతిలో మాట్లాడకూడదు.బ్యాలెన్స్‌డ్, హుందాతనంతో కూడిన మాటలతో వీడియోలు చేయాలి.