Winds and sandstorms in China... More than 600 flights canceled

China : చైనాలో గాలులు, ఇసుక తుపాను..600 పైగా విమాన సర్వీసులు రద్దు

China : చైనాలో భీకర గాలులు, ఇసుక తుపాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ గాలులతో రాజధాని బీజింగ్‌లో చెట్లు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. దాదాపు 693 విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో బీజింగ్‌, డాక్సింగ్‌లో మధ్యాహ్నం వరకు వందలాది విమాన, రైల్వే సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. అధికారులు పార్కులు తాత్కాలికంగా మూసేశారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో.. 75 ఏళ్లలో ఎన్నడూ లేని శక్తివంతమైన గాలులు వీచినట్లు కథనాలు పేర్కొన్నాయి.

Advertisements
image

ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు, ఇతర ముఖ్య కార్యక్రమాలకు ఆటంకం

ముఖ్యంగా దేశ ఉత్తర, తీర ప్రాంతాల్లో ప్రమాదకర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరించారు. ఈ గాలుల ప్రభావంతో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు, ఇతర ముఖ్య కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకూడదని.. జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఇక ఈ తుపాను వల్ల ట్రాఫిక్ వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింది. రోడ్లపై దృశ్యపటం తగ్గిపోయిన కారణంగా వాహనాల రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. పలు స్కూళ్లు, కార్యాలయాలు మూసివేయబడ్డాయి. రైలు సర్వీసులపై కూడా ప్రభావం చూపింది. వాతావరణ శాఖ ప్రకారం, ఇది మంగోలియా పరిధిలో ఏర్పడిన ఓ శక్తివంతమైన పిడుగు తుఫానుకు సంబంధించి ఉత్తర చైనా వైపుకు వచ్చిన ఇసుక తుఫానుల శ్రేణిలో ఒకటి. రాబోయే రెండు రోజుల పాటు ఈ ప్రభావం కొనసాగే అవకాశముందని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం అత్యవసర సహాయ చర్యలు ప్రారంభించిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Related Posts
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై ప్రభుత్వం కీలక నిర్ణయం..!
Government key decision on indiramma atmiya bharosa assurance..!

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందించనుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా వారికి లబ్ధి చేకూర్చనుంది. ఈ Read more

ఫ్లెక్సీలోన్స్ తెలంగాణ MSME రుణాలలో బలమైన వృద్ధి..
FlexiLoans Expects Strong Growth in Telangana MSME Loans to 2025

హైదరాబాద్‌ : భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫారమ్,FlexiLoans.com 2025లో తెలంగాణలో తమ రుణ వితరణలను గణనీయంగా పెంచడానికి ప్రణాళికలను వెల్లడించింది. ముఖ్యంగా, కంపెనీ తెలంగాణలో 2024 Read more

నేడు KRMB కీలక సమావేశం
KRMB meeting today

కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) నేడు హైదరాబాద్‌లోని జలసౌధలో కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు Read more

చిక్కుల్లో పడ్డ వెటరన్ యాక్టర్ ధర్మేంద్ర
Veteran actor Dharmendra is

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ ధర్మేంద్ర ప్రస్తుతం ఒక న్యాయపోరాటంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. 'గరమ్ ధరమ్ ధాబా' ఫ్రాంచైజీ కేసులో ఢిల్లీ పటియాలా కోర్టు ఆయనతో పాటు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×