Hyderabad: ఆ కండక్టర్ కి హయిట్ ఏ శాపం

Hyderabad: ఆ కండక్టర్ కి హయిట్ ఏ శాపం

సాధారణంగా మనుషుల ఎత్తు, బరువుల మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది. కొంతమంది చూడ్డానికి చాలా పొట్టిగా ఉంటారు. మరికొందరు చూస్తే ఏకంగా ఆజానుభావుడిలా కనిపిస్తారు. ఏడెనిమిది అడుగుల ఎత్తుతో కనిపించి అందరి చూపు తమ వైపుకు తిప్పుకుంటారు. కానీ ఆ ఎత్తు కారణంగా వారు ఎన్నో ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కొంటారు. కానీ అదే ఎత్తు ఓ వ్యక్తి  పాలిట శాపంగా మారింది.ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. చాంద్రాయణగుట్టకు చెందిన అమీన్ అహ్మద్ అన్సారీ అనే వ్యక్తి ఏడడుగుల ఎత్తుతో ఉన్నాడు బస్సేమో ఆరడుగులు ఉంది. దీంతో డ్యూటీలో ఉన్నంత సేపూ అతడు మెడను పక్కకు వంచి ఇబ్బందిగా పనిచేయాల్సి వస్తోంది దీంతో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అతను వాపోతున్నాడు.అతను ప్రస్తుతం మెహిదీపట్నం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

Advertisements

10గంటల ప్రయాణం

ఆయన తండ్రి కాచిగూడ డిపోలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. ఆయన అనారోగ్యం కారణంగా 2021లో మరణించగా కారుణ్య నియామకం కింద ఇంటర్‌ పూర్తిచేసిన అన్సారీకి మెహిదీపట్నం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా ఉద్యోగం ఇచ్చారు. అతడు 7 అడుగులు పొడవు ఉండటంతో విధులు నిర్వర్తించడం సవాల్‌గా మారింది.బస్సుల్లో రోజూ సగటున 5 ట్రిప్పుల్లో 10గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోంది. 195 సెం.మీ.(6 అడుగుల 4 అంగుళాలు) ఎత్తుండే బస్సు లోపల 214 సెం.మీ. పొడవున్న తాను గంటల తరబడి తల వంచి ప్రయాణిస్తుండటం వల్ల మెడ, వెన్నునొప్పి, నిద్రలేమితో హాస్పిటల్స్​ చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్సారీ వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అతడికి ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.ఎత్తుగా ఉండేవారు చిన్న చిన్న ప్రదేశాలలో చాలా ఇబ్బంది పడతారు. వారు వాహనాలలో ప్రయాణించలేరు. చిన్న చిన్న ఇళ్లలో ఉండలేరు. ఇక ఉద్యోగాలు చేసేవారు అయితే సమస్యలు ఎదుర్కొంటారు.

R93nB2CohBitdNHvsOvp

సమస్యలు

అమీన్ అహ్మద్ అన్సారీ ఏడడుగుల ఎత్తుతో ఉన్నాడు బస్సేమో ఆరడుగులు ఉంది.తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అతను వాపోతున్నాడు.తాజాగా ప్రయాణికులు దీని పై స్పందిస్తున్నారు,ఉన్నతాధికారులు స్పందించి అతడికి ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.సాధారణంగా ఎత్తు ఎక్కువగా ఉండటం ఎంతోమందికి గర్వంగా అనిపించవచ్చు. కానీ నిజ జీవితంలో ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా కూడా కొన్ని సవాళ్లు ఎదురవుతుంటాయి.పూర్తిగా నిలబడలేని విధుల్లో (ఉదా: బస్సు కండక్టర్, విమానంలో పనిచేసే ఉద్యోగాలు, చిన్న ఆఫీసుల్లో) ఎక్కువ ఎత్తు ఉండటం వల్ల సమస్యలు ఏర్పడతాయి. ఇలా ఒక ఉద్యోగం ఉన్నా, దానిని సౌకర్యంగా చేయలేక బాధపడే పరిస్థితి వస్తుంది.

Related Posts
పుప్పాలగూడలో అగ్నిప్రమాదం : ముగ్గురు మృతి
Fire in Puppalguda.. Three killed

దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక ముగ్గురు మృతి హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడలో అగ్నిప్రమాదం సంభవించింది. రెండు అంతస్తుల భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు Read more

కౌశిక్ రెడ్డిపై 3 కేసులు
Kaushik Reddy

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌పై దురుసుగా ప్రవర్తించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో గందరగోళం సృష్టించి, పక్కదారి పట్టించారని Read more

అనారోగ్య సమస్యలతో వృద్ధ దంపతులు ఆత్యహత్య
img1

అనారోగ్య సమస్యలతో వృద్ధ దంపతులు ఆత్యహత్య ఉప్పల్ : ఒకపక్క అనారోగ్య సమస్యలు, మరో వైపు ఉన్న ఒక్క కుమారుడు తమకు దూరంగా ఉండడం, వృధ్యాప్యంలో వచ్చిన Read more

Vijayashanti : ఎమ్మెల్సీ విజయశాంతి భర్తకు బెదిరింపులు
Threats to MLC Vijayashanti husband

Vijayashanti : డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేంతవరకు అతి దారుణంగా చంపేస్తానంటూ ఎమ్మెల్సీ విజయశాంతి భర్తను ఓ వ్యక్తి బెదిరించాడు. దాంతో అతడిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×