వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.మాల్డా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనలు తీవ్రంగా నమోదయ్యాయి.ప్రజలు రోడ్లపైకి వచ్చి బంద్‌లు, రాస్తారోకోలు చేశారు.ఈ నిరసనలు కొన్ని చోట్ల హింసాత్మకంగా మారాయి.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. అయితే, ఘర్షణల మధ్య ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ఘర్షణల మధ్య ముగ్గురి ప్రాణాలు
ఇద్దరు వ్యక్తులు ఆందోళనల సమయంలో జరిగిన దాడుల్లో మృతి చెందారు.ఇంకొకరు పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా ఉంది.జంగీపూర్ వంటి ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర బలగాలను రంగంలోకి దించారు.రాష్ట్ర ప్రభుత్వమే ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
రాళ్ల దాడులు, అరెస్టులు
భద్రతా సిబ్బందిపై నిరసనకారులు రాళ్ల దాడులకు దిగారు.పోలీసులు కూడా సమాధానంగా లాఠీచార్జ్ చేశారు.ఇప్పటి వరకు 110 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.చిన్న పిల్లలు, మహిళలు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు.దాంతో, పరిస్థితి కాస్త సున్నితంగా మారిందని అంటున్నారు స్థానికులు.
మమత బెనర్జీ స్పందన
ఈ ఘటనలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు.ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఆమె కోరారు. ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు.వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధంగా పోరాడాలన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించటం హక్కే కానీ, హింసను ప్రోత్సహించరాదని ఆమె స్పష్టం చేశారు.ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన చోట్లున్నాయ్. రాత్రి వేళ కర్ఫ్యూకు ఆదేశాలూ వెలువడుతున్నాయి.సమస్య రూట్‌లోకి పోకుండా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రజలు కూడా సానుకూలంగా స్పందించాలని అధికార యంత్రాంగం కోరుతోంది.
Read Also : Mamata Banerjee : వక్ఫ్ చట్టం బెంగాల్‌లో లేదు : మమతా బెనర్జీ