తమిళనాడు విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP 2020) అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును డీఎంకే ప్రభుత్వం నాశనం చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఘాటుగా స్పందించారు.

ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు:
కేంద్ర మంత్రి లోక్‌సభలో ప్రసంగిస్తూ, తమిళనాడు విద్యా విధానం గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రభుత్వం విద్యార్థులకు నష్టం కలిగించే విధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని వ్యతిరేకిస్తోంది. NEP 2020 అనుసరించకపోవడం ద్వారా విద్యార్థులను దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అవకాశాల నుంచి వేరుచేస్తోంది. త్రీ లాంగ్వేజ్ పాలసీని వ్యతిరేకించడం రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతుంది. ఈ వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారి తీశాయి. డీఎంకే ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తూ సభను అడ్డుకున్నారు.
NEP 2020 వివాదం:
NEP 2020 అమలుపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. డీఎంకే ప్రభుత్వం వ్యతిరేకత కారణాలు- హిందీ భాషను ప్రోత్సహించే విధానం – తమిళనాడు రాష్ట్రంలో హిందీ థేరియాదు (హిందీ తెలియదు) అనే నినాదం విస్తృతంగా వినిపిస్తోంది. త్రీ లాంగ్వేజ్ పాలసీకి వ్యతిరేకత – తమిళనాడు విద్యా విధానంలో తమిళ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని డీఎంకే అభిప్రాయపడుతోంది. కేంద్రం మోసపూరిత ధోరణి – NEP అమలు విషయంలో మొదట ఒప్పందం చేసుకున్నట్లు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం, ఆ తరువాత తన వైఖరిని మార్చుకుందని ప్రధాన్ ఆరోపించారు. తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తు కేంద్రానికి ప్రాధాన్యం. NEP 2020 అమలుపై ఒప్పందం చేసుకున్న రాష్ట్రాలకు నిధులు మంజూరవుతున్నాయి. తమిళనాడు విద్యా విధానాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోంది. ఈ వివాదం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. డీఎంకే వర్సెస్ కేంద్రం వాదన కొనసాగుతుండగా, రాష్ట్ర విద్యా విధానంపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలనుకుంటోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎంకే ఎంపీలు మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. స్పీకర్ ఓం బిర్లా పరిస్థితిని చక్కదిద్దేందుకు తీవ్రంగా శ్రమించినా, నిరసనలు కొనసాగాయి. విద్యా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం శ్రీ స్కీమ్ కింద 27,000 కోట్ల రూపాయలు కేటాయించామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇందులో కేంద్రం వాటా 18,000 కోట్లు. 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 12,000 స్కూళ్లకు ఈ నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. కానీ, ఎన్ఈపీ అమలుకు అంగీకరించని తమిళనాడు, ఈ పథకానికి కూడా తన మద్దతు ఉపసంహరించుకుంది.