IPL:మొదలైన ఐపీఎల్ ముంబై ఇండియన్స్‌‌కి స్వాగతం

IPL:మొదలైన ఐపీఎల్ ముంబై ఇండియన్స్‌‌కి స్వాగతం

మార్చి 22న ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం.క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఎట్టకేలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా జరగనుంది.

సీజన్ హైలైట్

ఐపీఎల్ ప్రారంభమవుతుందంటేనే క్రికెట్ ఫ్యాన్స్ ఆనందోత్సాహాలతో మునిగిపోయి ఉంటారు. అయితే ఈ సీజన్‌లో అందరి దృష్టి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కె) – ముంబై ఇండియన్స్ (ఎంఐ) మధ్య జరిగే మ్యాచ్‌పై ఉంది. ఈ క్లాసిక్ పోరును ‘ఎల క్లాసికో’గా అభివర్ణించే అభిమానులు, రెండు జట్ల మధ్య ఎప్పుడూ హై వోల్టేజ్ పోటీ ఉంటుందనేది నిజం.

చెన్నై చేరుకున్న ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్ జట్టు తన తొలి మ్యాచ్ కోసం చెపాక్ స్టేడియంకు చేరుకుంది. చెన్నై విమానాశ్రయంలో అడుగుపెట్టగానే అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ముంబై ఇండియన్స్ అధికారిక సోషల్ మీడియా ద్వారా ఈ అద్భుతమైన క్షణాలను అభిమానులతో పంచుకుంది.”వనక్కం చెన్నై! మేము ఇక్కడకి వచ్చాము..” అంటూ తిలక్ వర్మ చెన్నై అభిమానులకు హాయ్ చెప్పాడు.తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ తరపున అద్భుత ఆటతీరు కనబరుస్తూ, తన స్థానం టీమిండియాలో కూడా స్థిరపరచుకున్నాడు.ముంబై స్క్వాడ్‌లో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్లు ఉండటం మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది.

CRICKET IND IPL T20 MUMBAI LUCKNOW

చెన్నై వర్సెస్ ముంబై

చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ మధ్య మార్చి 23 రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో చెన్నైపై ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఈ రెండు జట్లు 37 మ్యాచ్‌లు ఆడగా చెన్నై 17 మాత్రమే గెలవగా, ముంబై ఇండియన్స్ 20 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 2012 తర్వాత ముంబై ఇండియన్స్ తాను ఆడిన తొలి మ్యాచ్‌లో ఇప్పటి వరకూ గెలవలేదు. సీఎస్కేపైనే ఎక్కువగా ఓడిపోయింది. మరి ఈ ఏడాది జరిగే మ్యాచ్‌లో ఏవిధంగా రాణిస్తుందో చూడాలి.

ముంబై ఇండియన్స్ టీం

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రోబిన్, ర్యాన్ రికెల్టన్, సృజిత్ కృష్ణన్, బేవాన్ జాకబ్స్, తిలక్ వర్మ, నమన్ ధీర్, విల్ జాక్స్, మిచెల్ శాన్‌ట్నర్, రాజ్ అంగడ్ బవా, విఘ్నేశ్ పుతుర్, కార్బన్ బోష్, ట్రెంట్ బౌల్ట్, కరణ్ శర్మ, దీపక్ చాహర్, అశ్వినీ కుమార్, టాప్‌లే, సత్యనారాయణ పెన్మత్స, అర్జున్ టెండూల్కర్, ముజీబ్ అర్ రెహ్మాన్, జస్ప్రిత్ బుమ్రా.

Related Posts
 కేకేఆర్ రిటెన్షన్‌ లిస్టులో పేరు లేకపోవడంపై స్టార్ క్రికెటర్ ఎమోషనల్
venkatesh iyer

ఐపీఎల్ 2024 విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఇటీవల ప్రకటించిన రిటెన్షన్ లిస్టులో తన పేరు లేకపోవడం పట్ల ఆ జట్టు స్టార్ ఆటగాడు వెంకటేశ్ Read more

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది
వన్డే సిరీస్ లో కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది

భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఈ నెల 6 నుంచి ప్రారంభమైంది ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అనేక రికార్డులు Read more

భారత్-ఇంగ్లండ్ సిరీస్ షెడ్యూల్ టీ20
భారత్ ఇంగ్లండ్ సిరీస్ షెడ్యూల్ టీ20

భారత్, ఇంగ్లండ్ జట్లు ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లు 2025 జనవరి 22న ప్రారంభమవుతాయి. టీ20లకు సూర్యకుమార్ యాదవ్ Read more

తన ఫామ్ పై స్పందించిన కోహ్లీ..
virat kohli

పెర్త్ మైదానంలో అద్భుతమైన సెంచరీ చేసిన విరాట్ కోహ్లి, ఆ తర్వాత మ్యాచ్‌లలో తన ఆటతీరుపై స్వయంగా మాట్లాడారు.టెస్టు క్రికెట్‌లో ఎదురైన సవాళ్లను అంగీకరించడంలో,తన క్రమశిక్షణను మెరుగుపరచడంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *