IPL:మొదలైన ఐపీఎల్ ముంబై ఇండియన్స్‌‌కి స్వాగతం

IPL:మొదలైన ఐపీఎల్ ముంబై ఇండియన్స్‌‌కి స్వాగతం

మార్చి 22న ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం.క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఎట్టకేలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా జరగనుంది.

Advertisements

సీజన్ హైలైట్

ఐపీఎల్ ప్రారంభమవుతుందంటేనే క్రికెట్ ఫ్యాన్స్ ఆనందోత్సాహాలతో మునిగిపోయి ఉంటారు. అయితే ఈ సీజన్‌లో అందరి దృష్టి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కె) – ముంబై ఇండియన్స్ (ఎంఐ) మధ్య జరిగే మ్యాచ్‌పై ఉంది. ఈ క్లాసిక్ పోరును ‘ఎల క్లాసికో’గా అభివర్ణించే అభిమానులు, రెండు జట్ల మధ్య ఎప్పుడూ హై వోల్టేజ్ పోటీ ఉంటుందనేది నిజం.

చెన్నై చేరుకున్న ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్ జట్టు తన తొలి మ్యాచ్ కోసం చెపాక్ స్టేడియంకు చేరుకుంది. చెన్నై విమానాశ్రయంలో అడుగుపెట్టగానే అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ముంబై ఇండియన్స్ అధికారిక సోషల్ మీడియా ద్వారా ఈ అద్భుతమైన క్షణాలను అభిమానులతో పంచుకుంది.”వనక్కం చెన్నై! మేము ఇక్కడకి వచ్చాము..” అంటూ తిలక్ వర్మ చెన్నై అభిమానులకు హాయ్ చెప్పాడు.తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ తరపున అద్భుత ఆటతీరు కనబరుస్తూ, తన స్థానం టీమిండియాలో కూడా స్థిరపరచుకున్నాడు.ముంబై స్క్వాడ్‌లో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్లు ఉండటం మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది.

CRICKET IND IPL T20 MUMBAI LUCKNOW

చెన్నై వర్సెస్ ముంబై

చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ మధ్య మార్చి 23 రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో చెన్నైపై ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఈ రెండు జట్లు 37 మ్యాచ్‌లు ఆడగా చెన్నై 17 మాత్రమే గెలవగా, ముంబై ఇండియన్స్ 20 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 2012 తర్వాత ముంబై ఇండియన్స్ తాను ఆడిన తొలి మ్యాచ్‌లో ఇప్పటి వరకూ గెలవలేదు. సీఎస్కేపైనే ఎక్కువగా ఓడిపోయింది. మరి ఈ ఏడాది జరిగే మ్యాచ్‌లో ఏవిధంగా రాణిస్తుందో చూడాలి.

ముంబై ఇండియన్స్ టీం

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రోబిన్, ర్యాన్ రికెల్టన్, సృజిత్ కృష్ణన్, బేవాన్ జాకబ్స్, తిలక్ వర్మ, నమన్ ధీర్, విల్ జాక్స్, మిచెల్ శాన్‌ట్నర్, రాజ్ అంగడ్ బవా, విఘ్నేశ్ పుతుర్, కార్బన్ బోష్, ట్రెంట్ బౌల్ట్, కరణ్ శర్మ, దీపక్ చాహర్, అశ్వినీ కుమార్, టాప్‌లే, సత్యనారాయణ పెన్మత్స, అర్జున్ టెండూల్కర్, ముజీబ్ అర్ రెహ్మాన్, జస్ప్రిత్ బుమ్రా.

Related Posts
రోహిత్ కు ఏమైంది ఫాన్స్ ఆందోళన
రోహిత్ కు ఏమైంది ఫాన్స్ ఆందోళన

చాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని సాధించిన భారత జట్టు, న్యూజిలాండ్‌తో జరగబోయే చివరి లీగ్ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. వరుసగా రెండు విజయాలు అందుకున్న టీమిండియా, Read more

IPL2025 :కుల్దీప్ ను నెట్టేసిన రిషబ్ పంత్‌
IPL2025 :కుల్దీప్ ను నెట్టేసిన రిషబ్ పంత్‌

ఐపీఎల్ 2025 సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్ జి) ఒక వికెట్ తేడాతో ఓటమి పాలైంది.ఐపీఎల్ 2025 Read more

భారత్-పాక్ మ్యాచ్..గణాంకాలు ఏం చెపుతున్నాయి?
భారత్-పాక్ మ్యాచ్..గణాంకాలు ఏం చెపుతున్నాయి?

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రేపు (23న) భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులందరూ ఈ పోరుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దుబాయ్ Read more

కోహ్లీ ఇంటికి అభిమాని వస్తే..ఏం జరిగిందంటే.?
కోహ్లీ ఇంటికి అభిమాని వస్తే.. ఏం జరిగిందంటే.

విరాట్ కోహ్లీ టీమిండియా రన్ మెషిన్ తన ఆటతో మాత్రమే కాకుండా తన పాపులారిటీతో కూడా ప్రత్యేక గుర్తింపు పొందాడు.మైదానంలో ఎలా ఆడినా అతని క్రేజ్ మాత్రం Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×