భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, తన అద్భుతమైన బ్యాటింగ్ టాలెంట్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను పొందాడు. 2027 వన్డే ప్రపంచ కప్ గెలవాలనే తన కోరికను విరాట్ ఇటీవల ఓ కార్యక్రమంలో సైనా నెహ్వాల్‌తో కలిసి పాల్గొన్నప్పుడు మనసులోమాట వ్యక్తం చేశాడు. ఈ ప్రకటనతో అతని అభిమానులు ఎంతో ఆనందించారు,ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న విరాట్, 2027 వన్డే ప్రపంచ కప్‌లో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాలని భావిస్తున్నాడు.దక్షిణాఫ్రికాలో జరగనున్న ఈ టోర్నమెంట్ కోసం కోహ్లీ ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాడని అభిమానులు భావిస్తున్నారు.
కార్యక్రమం
భారత జట్టు లెజెండరీ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ గురించి ఓ కీలక వార్త బయటకు వస్తోంది. ఇటీవల విరాట్ కోహ్లీ ఒక కార్యక్రమంలో సైనా నెహ్వాల్‌తో కలిసి కనిపించాడు. విరాట్ కోహ్లీ ఫూచర్ ప్లాన్స్ గురించి ఈ కార్యక్రమంలో ప్రశ్నించారు. దీనిపై విరాట్ కోహ్లీ ఇచ్చిన సమాధానం భారత అభిమానులందరినీ, విరాట్ అభిమానులను ఎంతో సంతోషపరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రకటన
ఈ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, నాకు తెలియదు, బహుశా నేను 2027 ప్రపంచ కప్ గెలవడానికి ప్రయత్నిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ ఈ విషయం చెప్పగానే, అక్కడ ఉన్న వారందరూ చాలా సంతోషించారు. విరాట్ కోహ్లీ ప్రకటన తర్వాత, విరాట్ కోహ్లీ తదుపరి చూపు 2027 వన్డే ప్రపంచ కప్ ఆడి గెలవడం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

కెరీర్
కోహ్లి ఇప్పటివరకు మొత్తం 545 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి 27,000కి పైగా పరుగులు సాధించారు. తన కెరీర్‌లో ఎన్నో అద్భుత ప్రదర్శనలతో కోట్లాది అభిమానుల మనసు గెలుచుకున్న విరాట్, ఈ ఘనతతో తన స్థాయిని మరింత పెంచుకున్నారు. ఈ రికార్డు సాధనకు ముందు కూడా కోహ్లి ఎన్నో విజయాలను సాధించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా ఆయన అత్యుత్తమ స్థాయిలో నిలిచారు. ముఖ్యంగా ఇంగ్లండ్ పేసర్లు, స్వింగ్ బౌలింగ్‌కు ఎదుర్కొనే శైలి కోహ్లిని ప్రత్యేకమైన ఆటగాడిగా నిలబెట్టింది. మొత్తం మీద కోహ్లి మరో అద్భుత రికార్డును తన ఖాతాలో వేసుకోవడంతో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
బ్యాటింగ్
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 4,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచారు. ఈ ఘనత సాధించి తన అద్భుత బ్యాటింగ్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. కోహ్లి ఈ రికార్డును సాధించడంతో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌ను కూడా అధిగమించారు. ఇంగ్లండ్‌పై 3,990 పరుగులు చేసిన సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇది కోహ్లి స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. ఇంగ్లండ్ వంటి బలమైన జట్టుకు వ్యతిరేకంగా ఇంత భారీ స్కోరు చేయడం ఆయన నిరంతర శ్రమ, అంకితభావానికి నిదర్శనం.