అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుండి పరస్పర సుంకాలు విధించబోతున్నారు. సుంకాలు విధించబడే దేశాల లిస్టులో ఇండియా పేరు కూడా ఉంది, దింతో భారతదేశంలో దీని పై ఇప్పటికే ఉద్రిక్తత పెరిగింది. అయితే రీసర్చ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ MK గ్లోబల్ భారతదేశంపై అమెరికా సుంకాల ప్రభావాన్ని వెల్లడించింది. ఒకవేళ అమెరికా 10% సుంకం విధిస్తే భారతదేశం దాదాపు 6 బిలియన్ డాలర్లు లేదా GDPలో 0.16% నష్టపోవచ్చని సంస్థ నివేదిక పేర్కొంది.
రంగాలు ప్రభావితమవుతాయంటే..
ఒకవేళ సుంకం 25 శాతానికి పెరిగితే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని నివేదికలో పేర్కొంది. ఈ కారణంగా భారతదేశం అమెరికన్ ఎగుమతులలో $31 బిలియన్ల వరకు నష్టాన్ని చవిచూడవచ్చు. నివేదిక ప్రకారం ఆటో, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక రంగాలు నష్టాలు చూడవచ్చు. దీనితో పాటు ట్రంప్ సుంకం వస్త్రాలు, రత్నాలు/ఆభరణాలు వంటి మార్కెట్లపై కూడా పెద్దగా ప్రభావాన్ని చూపుతుంది.

భారతదేశం అమెరికాతో చర్చలు
అమెరికా నుండి ఇంధన దిగుమతులను (ముడి చమురు, సహజ వాయువు) పెంచడం, రక్షణ కొనుగోళ్లు ఇంకా సహకారాన్ని పెంచడం, కొన్ని వ్యవసాయ/ఆహార వస్తువులు, విదేశీ ఎలక్ట్రిక్ వాహనాలపై సుంకాలను తగ్గించడం ద్వారా భారతదేశం పరస్పర సుంకాల ప్రభావాన్ని పరిమితం చేయగలదని ఎమ్కే గ్లోబల్ భావిస్తుంది. అయితే కొన్ని కీలక రంగాలలో సుంకాలను తగ్గించడానికి భారతదేశం అమెరికాతో చర్చలు జరపాలి, దీని వల్ల దేశీయ పరిశ్రమకు హాని కలిగించదు.
భయాందోళనలకు కారణమవుతున్న ఆటో టారిఫ్‌లు
ట్రంప్ ఇటీవల విదేశాల నుండి వచ్చే వాహనాలు, ఆటో విడిభాగాలపై 25% సుంకం ప్రకటించారు. అమెరికా చాల దేశాల నుండి దాదాపు $300 బిలియన్ల విలువైన ఆటో విడిభాగాలను దిగుమతి చేసుకుంటుంది, ఇందులో భారతదేశం కూడా ఉంది. ఇంజిన్ విడిభాగాలు, ట్రాన్స్‌మిషన్ భాగాలు, ఎలక్ట్రికల్ సిస్టమ్‌లతో సహా ఎన్నో రకాల ఉత్పత్తులు భారతదేశం నుండి అమెరికాకు ఎగుమతి అవుతాయి.