ట్రంప్, జెలెన్‌స్కీ ఆ మధ్య పెరుగుతున్న దూరం?

జెలెన్‌స్కీ క్షమాపణలు చెప్పాలి: అమెరికా

మూడు సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోన్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించడానికి అమెరికా చేసిన తొలి ప్రయత్నం విఫలమైనట్టే. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఉక్రెయిన్‌కు చెందిన కౌంటర్‌పార్ట్ వొలొదిమిర్ జెలెన్‌స్కీతో నిర్వహించిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి జెలెన్‌స్కీ అంగీకరించట్లేదనేది వైట్‌హౌస్ వాదన. అది నిజమని నిరూపించేలా వ్యవహరించారు జెలెన్‌స్కీ. డొనాల్డ్ ట్రంప్‌తో ముఖాముఖి భేటీ అనంతరం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్‌కు క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. అమెరికా పర్యటనలో ఉన్న జెలెన్‌స్కీ- వైట్‌హౌస్ ఓవల్ ఆఫీస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. యుద్ధాన్ని నివారించడమే ఈ అత్యున్నత స్థాయి సమావేశం ప్రధాన అజెండా. ఈ విషయంలో ట్రంప్ చేసిన కొన్ని ప్రతిపాదనలను అంగీకరించలేదు జెలెన్‌స్కీ. కాల్పుల విరమణకు ఒప్పుకోలేదు. ఫలితంగా- ఈ ఇద్దరు నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

Advertisements
జెలెన్‌స్కీ క్షమాపణలు చెప్పాలి: అమెరికా

డిబేట్ మొత్తం కూడా లైవ్ టెలికాస్ట్

సుదీర్ఘ వాదులట సంభవించింది. ఈ హీటెడ్ డిబేట్ మొత్తం కూడా లైవ్ టెలికాస్ట్ అయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తరఫున ట్రంప్ వాదిస్తోన్నారనే అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు జెలెన్‌స్కీ. మధ్యవర్తిగా రెండు దేశాలకు ప్రయోజనం కలిగించడానికి భిన్నంగా పుతిన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోన్నారనే వాదనను వినిపించారు. ఈ వాగ్వివాదం కారణంగా ఈ భేటీ అర్ధాంతరంగా ముగిసింది.

తానేమీ తప్పుగా ప్రవర్తించలేదంటూ జెలెన్‌స్కీ వివరణ

చర్చలు కొనసాగుతున్న దశలోనే జెలెన్‌స్కీ.. వైట్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోవడం కనిపించింది. ఇందుకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ సైతం తెరమీదికి వచ్చింది. దీన్ని ఆయన తోసిపుచ్చారు. తానేమీ తప్పుగా ప్రవర్తించలేదంటూ సమర్థించుకున్నారు. ఈ వాగ్వివాద సమయంలో అక్కడే ఉన్న అమెరికాలోని ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మరకోవా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ ఇద్దరు నేతల మధ్య మాటలు.. తూటాల్లా పేలుతున్న సమయంలో ఆమె తలదించుకున్నారు. కన్నీళ్లొక్కటే తక్కువ అన్నట్టు కనిపించారు. తలపట్టుకున్నారు.

Related Posts
హోలీ సంబరాల్లో పాల్గొన్న న్యూజిలాండ్ ప్రధాని లుక్సాన్ – వైరల్ వీడియో
హోలీ సంబరాల్లో పాల్గొన్న న్యూజిలాండ్ ప్రధాని లుక్సాన్ – వైరల్ వీడియో

హోలీ పండుగ భారతదేశంలో అత్యంత ప్రముఖంగా జరుపుకునే వేడుకలలో ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహంగా జరుపుకుంటారు. విదేశాల్లో నివసించే భారతీయులు Read more

ట్రంప్, జెలెన్‌స్కీల మధ్య పెరుగుతున్న దూరం?
ట్రంప్, జెలెన్‌స్కీ ఆ మధ్య పెరుగుతున్న దూరం?

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికా నుంచి వందల బిలియన్ డాలర్ల సొమ్ము తీసుకున్నా జెలెన్‌స్కీకి కృతజ్ఞత లేదని ఆరోపించారు. Read more

డొనాల్డ్ ట్రంప్ 100% టారిఫ్ హెచ్చరిక
tarrif

ఈ జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ప్రపంచంలో మరో టారిఫ్ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ట్రంప్, BRICS దేశాలు అమెరికా Read more

US layoffs : అమెరికాలో ఉద్యోగ మాంద్యం .. మనోళ్లపై ప్రభావం
US layoffs అమెరికాలో ఉద్యోగ మాంద్యం మనోళ్లపై ప్రభావం

US layoffs : అమెరికాలో ఉద్యోగ మాంద్యం .. మనోళ్లపై ప్రభావం అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన ఎన్నారైలు భారత్‌కి వచ్చాక సరైన అవకాశాలు దొరకడం లేదు. భారతీయ Read more

×