donald trump

అవినీతి నిరోధక చట్టాన్ని సస్పెండ్ చేసిన ట్రంప్

పాత చట్టాల దుమ్ము దులుపుతున్న ట్రంప్

Advertisements

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పాత చట్టాల్లో మార్పులు చేయడం ప్రారంభించారు. తాజాగా అమెరికన్ వ్యాపారాలను పరిరక్షించాలనే పేరుతో ఓ కీలక చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. “Foreign Corrupt Practices Act (FCPA)” అనే చట్టాన్ని సస్పెండ్ చేసి వ్యాపార విభాగాలకు ఉపశమనం కల్పించాలని కొత్త అటార్నీ జనరల్ పామ్ బొండికి ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు.

FCPA అంటే ఏంటి అంటే..

1977లో ప్రవేశపెట్టిన FCPA చట్టం ప్రకారం.. అమెరికన్ కంపెనీలు లేదా వారి ప్రతినిధులు విదేశీ ప్రభుత్వ అధికారులకు లంచం ఇస్తే, అది నేరంగా పరిగణించబడుతుంది. ఈ చట్టం అంతర్జాతీయ వ్యాపారాల్లో అవినీతిని అరికట్టే ప్రధాన చర్యగా ఇంతకాలం అమలులో ఉంది. అయితే, అమెరికా కంపెనీల పోటీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని, వ్యాపారాలకు విఘాతం కలిగిస్తోందని ట్రంప్ వాదన.

FCPA అమలు వల్ల అమెరికన్ కంపెనీలు చాలా దేశాల్లో వ్యాపారం చేయడానికి ఇబ్బంది పడుతున్నాయని, కొన్ని దేశాల్లో వ్యాపారం చేసేందుకు స్థానిక అధికారులను ముడుపులు ఇచ్చే అవసరం వస్తుందని, ఈ చట్టం కారణంగా అమెరికా వ్యాపారాలు వెనుకబడుతున్నాయని ట్రంప్ చెబుతున్నారు. అందుకే ఈ చట్టాన్ని పూర్తిగా తొలగించకపోయినా, తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పై కూడా FCPA చట్టం ప్రకారం విచారణ జరుగుతోంది. విదేశీ సంస్థలకు అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన అంశాల్లో ఈ చట్టం ప్రస్తావనకు వచ్చింది. అయితే ట్రంప్ ఈ చట్టాన్ని నిలిపివేయడం వల్ల, ఇలాంటి కేసులపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష డెమోక్రాట్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది అవినీతికి తలుపులు తెరుచే ప్రమాదముందని, అమెరికా వ్యాపార ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉందని అంటున్నారు.

Related Posts
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపిన మహిళా సిబ్బంది
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపిన మహిళా సిబ్బంది

భారతీయ రైల్వే చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం లిఖించబడింది. మొట్టమొదటిసారిగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును పూర్తిగా మహిళా సిబ్బందితో నడిపి, నారీశక్తి సామర్థ్యాన్ని రైల్వే శాఖ సగర్వంగా Read more

Ludhiana girls: రీల్స్ కోసం బరి తెగిస్తున్న యువతులు.. రోడ్ పై డాన్స్
Ludhiana girls: రీల్స్ కోసం బరి తెగిస్తున్న యువతులు.. రోడ్ పై డాన్స్

ఇన్‌స్టాగ్రామ్ ఫేమ్ కోసం అసభ్యకర నృత్యం – నడిరోడ్డుపై రెచ్చిపోయిన యువతులు సోషల్ మీడియా ప్రాచుర్యం కోసం కొంతమంది యువత చేస్తున్న పనులు ఇప్పుడు సామాజిక బాధ్యతలపై Read more

Donald Trump: ట్రంప్ భారీ సుంకాలకు చైనా ఏం చేయనుంది?
అమెరికాతో ఒప్పందాలు చేసుకునే దేశాలకు చైనా వార్నింగ్

"నాకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అంటే చాలా గౌరవం ఉంది. చైనా పట్ల కూడా గౌరవం ఉంది. అయితే వాళ్లు దాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు" అని Read more

అక్కినేని నాగేశ్వరరావుని ప్రశంసించిన మోదీ
అక్కినేని నాగేశ్వరరావుని ప్రశంసించిన మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ప్రసారం చేసిన "మన్ కీ బాత్" కార్యక్రమంలో తన 117వ ఎపిసోడ్‌లో అక్కినేని నాగేశ్వరరావు, బాలీవుడ్ దిగ్గజాలు రాజ్ Read more

Advertisements
×