జో బైడన్ కు షాక్ ఇచ్చిన ట్రంప్.. ఆ సంతకాలు చెల్లవు

Donald Trump :జో బైడన్ కు షాక్ ఇచ్చిన ట్రంప్.. ఆ సంతకాలు చెల్లవు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక తాజాగా మరో మారు ట్రంప్ తీసుకున్న నిర్ణయం జో బైడన్ తో సహా మరికొందరికి షాక్ గా మారింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పదవి ముగుస్తున్న సమయంలో కొన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు.

Advertisements
జో బైడన్ కు షాక్ ఇచ్చిన ట్రంప్.. ఆ సంతకాలు చెల్లవు

క్షమాభిక్షల నిర్ణయాలు చెల్లవు

బైడెన్ క్షమాభిక్ష నిర్ణయాలపై ట్రంప్ షాక్ వందలాది మంది నేరస్తులకు క్షమాభిక్ష ప్రకటించారు. ఇక బైడెన్ సర్కార్ చివరి రోజుల్లో తీసుకున్న క్షమాభిక్షల నిర్ణయాలు చెల్లవని డోనాల్డ్ ట్రంప్ తాజాగా షాక్ ఇచ్చారు. ఆయన అధికారంలో ఉన్న చివరి రోజుల్లో జారీ చేసిన వాటిని రద్దు చేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఇక ఈ విషయాన్ని ట్రూత్ సోషల్ లో ఆయన పోస్ట్ చేశారు. నేరం చేసింది వారే అసలు ఆయనకి ఈ విషయం కూడా తెలియదని పేర్కొన్నారు. తనతో పాటు మరికొందరు అమాయకుల పైన రెండేళ్లపాటు నిర్వహించిన తప్పుడు దర్యాప్తుతో, తాము సంపాదించిన ఆధారాలన్నీ నాశనం చేశారన్నారు.

క్షమాభిక్ష పొందినవారికీ షాక్

ఇక ఈ పోస్ట్ తో బైడెన్ తో పాటు నాడు బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించిన వారందరికీ ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అయ్యింది. వారికి క్షమాభిక్ష మంజూరు చేసిన జో బైడెన్ ట్రంప్ ప్రభుత్వం నుంచి కొందరు కీలక వ్యక్తులను రక్షించడానికి జో బైడెన్ తాను అధ్యక్ష పీఠం నుండి దిగే ముందు కొన్ని సాహసోపేతమైన చర్యలకు దిగారు. డాక్టర్ ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లి, జనవరి 6 2021 వ తేదీన యుఎస్ క్యాపిటల్ పై దాడి చేసిన కేసును దర్యాప్తు చేసిన హౌస్ కమిటీ సభ్యులకు జో బైడెన్ క్షమాభిక్ష మంజూరు చేశారు.

Related Posts
UK విశ్వవిద్యాలయాలకు భారతీయ విద్యార్థుల దరఖాస్తుల్లో తగ్గుదల..
uk university

కొన్ని సంవత్సరాల క్రితం, బ్రిటన్ యూనివర్సిటీలలో భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే, తాజాగా వచ్చిన నివేదికలు ప్రకారం, ఈ సంవత్సరం బ్రిటన్ యూనివర్సిటీలలో భారతీయ Read more

విమానం ల్యాండింగ్ గేర్ లో రెండు మృతదేహాలు
flightlanding

ఫ్లోరిడాలోని విమానాశ్రయంలో వెలుగు చూసిన దారుణం విమాన ల్యాండింగ్ గేర్ వద్ద తనిఖీల్లో వెలుగు చూసిన మృతదేహాలు ధ్రువీకరించిన జెట్‌బ్లూ విమాన సంస్థ అమెరికాలో ఓ దారుణ Read more

ఆస్ట్రేలియాలో 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
social media

ఆస్ట్రేలియాలో 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా ఉపయోగించడానికి త్వరలో నిషేధం ఉండనుంది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటనీ ఆల్బానీజ్ గురువారం తన ప్రభుత్వం పిల్లల్లో సోషియల్ Read more

ఎలాన్ మస్క్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
టెస్లాపై దాడి చేస్తే 20ఏళ్లు జైలని ట్రంప్ వార్నింగ్

ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ భారతదేశంలో తన కంపెనీ కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. టెస్లా ఎలక్ట్రిక్ వాహన తయారీదారుగా గ్లోబల్ మార్కెట్‌లో ప్రత్యేక Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×