Tragedy in Madhya Pradesh.. 8 people die after inhaling toxic gases!

Toxic gas : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో విషాదం.. విష వాయువుల‌ను పీల్చి 8 మంది మృతి!

Toxic gas : మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బావిలో విషవాయువు పీల్చి 8 మంది మృతి చెందారు. ఖాండ్వా జిల్లాలో జిల్లాలోని చైగావ్ మఖాన్ ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి ఏటా గంగోర్ పండుగ సందర్భంగా విగ్రహాలను నిమజ్జనం చేసే ముందు బావులను శుభ్రం చేస్తారు. ఈ క్రమంలోనే చైగావ్ మఖాన్ ప్రాంతంలో పలువురు వ్యక్తులు కలిసి ఓ బావిని శుభ్రం చేసేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో మొదట ఓ వ్యక్తి బావిలోకి దిగగా శ్వాస సరిగా ఆడకపోవడంతో స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆయనను కాపాడటానికి మరో ఏడుగురు బావిలోకి దిగారు.

Advertisements
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో విషాదం విష వాయువుల‌ను

విషవాయువు వల్లే వారంతా ప్రాణాలు కోల్పోయి ఉంటారని

అయితే వారంతా ఎంతకూ బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా బావిలోనే మృతి చెంది కనిపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. బావి నుంచి వెలువడే విషవాయువు వల్లే వారంతా ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మృతులను రాకేష్ పటేల్ (23), అనిల్ పటేల్ (25), అజయ్ పటేల్ (24), శరణ్ పటేల్ (35), వాసుదేవ్ పటేల్ (40), గజానన్ పటేల్ (35), అర్జున్ పటేల్ (35), మోహన్ పటేల్ (53) గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా

ఇక, ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తం చేస్తూ, మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఈ తీవ్ర విషాదం నేప‌థ్యంలో గ్రామస్తులు… భవిష్యత్తులో మ‌రోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి బావిని మూసివేయాలని నిర్ణయించారు.

Related Posts
Samantha : స‌మంత‌కు గుడి క‌ట్టి పూజిస్తున్న తెనాలి యువ‌కుడు
Samantha : స‌మంత‌కు గుడి క‌ట్టి పూజిస్తున్న తెనాలి యువ‌కుడు

Samantha : స‌మంత‌కు గుడి క‌ట్టి పూజిస్తున్న తెనాలి యువ‌కుడు త‌మ అభిమాన న‌టీన‌టుల‌పై అభిమానులు చూపించే ప్రేమ అనిర్వచనీయం. కోలీవుడ్‌లో అభిమానులు త‌మ అభిమాన న‌టీన‌టుల‌కు Read more

స్కూళ్ల‌కు బాంబు బెదిరింపు కేసులో విద్యార్థి అరెస్టు
delhi schools

ఇటీవల కాలంలో విమానాలకు, స్కూల్స్ కు బాంబు బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. ఆమధ్య ఢిల్లీ స్కూళ్ల‌కు వరుసగా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. కాగా ఈ కేసులో Read more

Content Creators: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లకు కేంద్రం శుభవార్త
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లకు కేంద్రం శుభవార్త

ఇంటర్నెట్ దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి చేరుకోవటంతో ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా కంటెంట్ చూడగలుగుతున్నారు. దీంతో ఇన్‌ఫ్లుయన్సర్ల ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. యూట్యూబ్, Read more

Bill Gates: కృత్రిమ మేధస్సుపై బిల్‌గేట్స్ సంచల వ్యాఖ్యలు
కృత్రిమ మేధస్సుపై బిల్‌గేట్స్ సంచల వ్యాఖ్యలు

కృత్రిమ మేధస్సుతో భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు భారీగా కోల్పోవల్సి ఉంటుందని ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులు తీవ్ర ఆందోళ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏఐ పనితనం ఇప్పుడు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×