delhi schools

స్కూళ్ల‌కు బాంబు బెదిరింపు కేసులో విద్యార్థి అరెస్టు

ఇటీవల కాలంలో విమానాలకు, స్కూల్స్ కు బాంబు బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. ఆమధ్య ఢిల్లీ స్కూళ్ల‌కు వరుసగా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. కాగా ఈ కేసులో ఢిల్లీ పోలీసులు గుట్టువిప్పారు. ఆ కేసులో 12వ త‌ర‌గ‌తి విద్యార్థి విద్యార్థిని అరెస్టు చేశారు. స్కూల్ ఎగ్జామ్స్‌ను త‌ప్పించుకునేందుకు ఆ స్టూడెంట్ బెదిరింపు మెయిల్స్ చేసిన‌ట్లు గుర్తించారు.
దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఇటీవ‌ల వ‌రుస‌గా స్కూళ్ల‌కు బాంబు బెదిరింపు మెయిల్స్‌ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఆ బెదిరింపుల వెనుక ఉన్న అస‌లు దొంగ‌ను ఢిల్లీ పోలీసులు ప‌ట్టేశారు. ఓ మైన‌ర్ విద్యార్థి.. త‌న స్కూల్ ప‌రీక్ష‌ల‌ను త‌ప్పించుకునేందుకు ఆ బెదిరింపులు చేసిన‌ట్లు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌లో 12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ విద్యార్థిని క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. స్కూళ్ల‌కు బెదిరింపులు రావ‌డంతో.. చాలా రోజుల ఢిల్లీలో ప్ర‌భుత్వ అధికారులు హైరానాకు గుర‌య్యారు.

Advertisements


దాదాపు ఆరుసార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ చేశాడు ఆ స్టూడెంట్. అయితే ప్ర‌తిసారి త‌న స్వంత స్కూల్ కాకుండా.. మిగితా స్కూళ్ల పేరు మీద అత‌ను బెదిరింపు మెయిల్స్ చేసేవాడు. త‌న‌పై అనుమానం రాకుండా ఉండేందుకు అత‌ను ఆ ప్లాన్ చేశాడు. ప్ర‌తిసారి అత‌ను త‌న మెయిల్‌లో.. ఒకేసారి ప‌లు స్కూళ్ల‌కు బెదిరింపు మెయిల్స్ చేసేవాడు. ఓ సారి ఏకంగా అత‌ను 23 స్కూళ్ల‌కు ఒకేసారి మెయిల్ చేశాడు.

స్కూల్‌లో ప‌రీక్ష‌కు హాజ‌రు కావాల‌న్న ఉద్దేశం లేక‌పోవ‌డంతో ఆ మైన‌ర్ విద్యార్థి బాంబు బెదిరింపు మెయిల్స్ చేసిన‌ట్లు అధికారులు చెప్పారు. ఆ బెదిరింపుల వ‌ల్ల ఎగ్జామ్స్ ర‌ద్దు అవుతాయ‌న్న ఉద్దేశంతో అత‌ను అలా చేసిన‌ట్లు ప‌సిక‌ట్టారు. డ‌జ‌న్ల సంఖ్య‌లో ఉత్తుత్తి బాంబు బెదిరింపులు రావ‌డంతో.. కొన్ని వారాల పాటు ఢిల్లీ అధికారులు టెన్ష‌న్ ఫీల‌య్యారు. ఢిల్లీలో తానెప్పుడూ ఇలాంటి భ‌యాన‌క ప‌రిస్థితి చూడ‌లేద‌ని విద్యాశాఖ మంత్రి మ‌నీశ్ సిసోడియా తెలిపారు.

Related Posts
Central Minister:హైకోర్టు న్యాయమూర్తి పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మహిళా మంత్రి
Central Minister:హైకోర్టు న్యాయమూర్తి పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మహిళా మంత్రి

2021 నవంబర్‌లో జరిగిన లైంగిక వేధింపుల కేసు విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ మిశ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా Read more

లక్నోలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు
Bomb threat to Taj Hotel in Lucknow

లక్నో: లక్నోలోని తాజ్ హోటల్‌కు సోమవారం ఒక ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. అయితే, ఈ నగరంలో ఇప్పటికే 10 హోటళ్లకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు Read more

Pakishtan: అణ్వాయుధాల రేసులో పాకిస్తాన్‌ని దాటేసిన భారత్..
అణ్వాయుధాల రేసులో పాకిస్తాన్‌ని దాటేసిన భారత్..

దాయాది పాకిస్తాన్ దేశానికి దిమ్మతిరిగి పోయే న్యూస్ ఒకటి వెలుగు చూసింది. భారత్‌తో కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్.. ఈ వార్త విన్నాక కాస్త జంకాల్సిందే. ఇంతకు Read more

Tahawwur Rana : తహవూర్ రాణా అడిగిన వస్తువులు ఇవే..
Tahawwur Rana తహవ్వూర్ రాణా అప్పగింతపై కాంగ్రెస్ కౌంటర్

ముంబై 26/11 ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన తహవూర్ హుస్సేన్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కరుడుగట్టిన ఉగ్రవాదిని ఢిల్లీలోని Read more

Advertisements
×