అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ ఆర్థిక విధానంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాల విషయంలో తగ్గేదేలే అన్నట్లు చెప్పకనే చెప్పారు. అనేక దేశాలు తమ ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తున్నాయని మరోసారి గుర్తు చేశారు. ఈ క్రమంలో అమెరికా వాణిజ్య లోటు భారీగా పడిపోయిందన్నారు. ఈ క్రమంలో పలు దేశాలతో వాణిజ్య సుంకాలు విధించడం తప్పనిసరి అన్నారు. అందుకోసం ప్రధానంగా చైనా, యూరోపియన్ యూనియన్ (EU) సహా ఇతర దేశాలపై సుంకాలు విధించడం తప్పదన్నారు.
జాతీయ ప్రయోజనాలు
ట్రంప్ తన వ్యాఖ్యలలో అమెరికా లోటు తగ్గాలంటే సుంకాలు తప్పదన్నారు. సుంకాలు ఒక ఆర్థిక వ్యూహంగా, జాతీయ ప్రయోజనాలు సాధించడంలో కీలకపాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. ట్రంప్ ప్రకారం, సుంకాలు కేవలం ఆదాయ వనరుగా కాకుండా, అమెరికా ఆర్థిక స్వావలంబనను పెంచుతుందన్నారు. పలువురు దీనిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, ప్రజలు మాత్రం ఏదో ఒక రోజు ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

జో బైడెన్ నిద్రపోతున్న అధ్యక్షుడు
అంతేకాదు ట్రంప్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై మరోసారి విమర్శలు చేశారు. ఆయనను నిద్రపోతున్న అధ్యక్షుడని ఎద్దేవా చేశారు. బైడెన్ పాలనలో అమెరికా వాణిజ్య లోటు మరింత పెరిగిందని, ప్రత్యేకంగా, చైనా, యూరోపియన్ యూనియన్ తో వాణిజ్య సంబంధాలు మరింత దిగజారాయన్నారు. బైడెన్ విధానాలు విదేశీ పోటీదారులకు అనుకూలంగా మారాయని, అవి అమెరికన్ పరిశ్రమను బలహీనపరిచాయని ట్రంప్ తెలిపారు.
గణాంకాలు, వాణిజ్య లోటు
అమెరికా వాణిజ్య పరిస్థితి ప్రస్తుతం చాలా అండర్ స్ట్రెయిన్ ఉందని ట్రంప్ అన్నారు. 2024లో, అమెరికా, చైనా మధ్య వాణిజ్య లోటు $295.4 బిలియన్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరం కంటే 5.8% ఎక్కువ. అలాగే, యూరోపియన్ యూనియన్ వాణిజ్య లోటు 2024లో $235.6 బిలియన్లుగా నమోదైంది.
READ ALSO: Donald Trump: చర్చానీయాంశంగా మారిన ట్రంప్ ‘మూడోసారి’ ఎన్నిక